తేజు రేంజ్ అంతలా పడిపోయిందా?

తేజు రేంజ్ అంతలా పడిపోయిందా?

హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, వి.వి.వినాయక్, కరుణాకరన్ లాంటి పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసిన హీరో సాయిధరమ్ తేజ్. కానీ ఇందులోని కొందరు స్టార్ డైరెక్టర్లే అతడి కొంప ముంచారు. వరుసగా అరడజను ఫ్లాపులు ఎదుర్కొన్న తేజు పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ మధ్యే ‘చిత్రలహరి’ అనే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూశాడు తేజు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. పొంగిపోయే విజయం కాదు. అలాగని నిరాశ చెందే పరాజయమూ కాదు.

ఇప్పుడతను మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించే ఈ చిత్రానికి ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుండగా.. దీని తర్వాత తేజు మరో సినిమా కమిటైనట్లుగా వార్తలొస్తున్నాయి.

త్రివిక్రమ్ దగ్గర శిష్యరికం చేసి.. ‘బెస్ట్ యాక్టర్స్’ అనే సినిమాతో దర్శకుడిగా మారి.. సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘వజ్ర కవచధర గోవిందా’ సినిమాలు తీసిన అరుణ్ పవార్ దర్శకత్వంలో తేజు నటించే అవకాశాలున్నాయట. ‘వజ్రకవచధర గోవిందా’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అరుణ్.. తేజు కోసం తాను మంచి లవ్ స్టోరీ రెడీ చేసినట్లు తెలిపాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ నిర్మించబోతున్నాడట.

ప్రస్తుతం బాబీ ‘వెంకీ మామ’ తీస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందటే బాబీకి ప్రేమకథ చెప్పి మెప్పించానని.. ఇద్దరం కలిసి తేజును సంప్రదించామని చెప్పాడు అరుణ్.  కథ బాగున్నా కూడా అరుణ్‌తో తేజు సినిమా అంటే జనాలు రకరకాలగు మాట్లాడుకుంటారేమో. కానీ కెరీర్లో ఎంతో పతనం చూసిన తేజు.. స్క్రిప్టు అంత బాగుంటే అరుణ్‌తో సినిమా చేయడంలో తప్పేముంది?`

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English