అమితాబ్ ట్విట్టర్ అకౌంట్లో ‘ఐ లవ్ పాకిస్థాన్’

అమితాబ్ ట్విట్టర్ అకౌంట్లో ‘ఐ లవ్ పాకిస్థాన్’

ఇండియాలో అత్యధిక ట్విట్టర్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీల్లో అమితాబ్ బచ్చన్ బచ్చన్ ఒకరు. ఆయన్ని ట్విట్టర్లో ఏకంగా 3.7 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఆ ఫాలోవర్లందరికీ పెద్ద షాకిస్తూ... నిన్న రాత్రి అమితాబ్ ట్విట్టర్ అకౌంట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అమితాబ్ డీపీ నుంచి ఆయన ఫొటో ఎగిరిపోయి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటో వచ్చి చేరింది. అంతే కాదు.. ‘ఐ లవ్ పాకిస్థాన్’ అన్న నినాదం కూడా కనిపించింది. దీనికి కారణం.. అమితాబ్ అకౌంట్ హ్యాక్ కావడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ పని ఏ పాకిస్థానీయో చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ టర్కీకి చెందిన ఆయిల్ డిజ్ టిమ్ అనే హ్యాకర్.. ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది. ఐతే అతడి వెనుక పాకిస్థానీయుల హస్తం ఉందని భావిస్తున్నారు.

అమితాబ్ బయోడేటాలో ‘ఐ లవ్ పాకిస్తాన్’ అనే స్లోగన్ తో పాటు టర్కిష్ జాతీయ పతాకం ఉన్న ఇమోజిని కూడా చేర్చాడు హ్యాకర్. ఈ విషయం గమనించిన అమితాబ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. త్వరగానే తన అకౌంట్‌ను పునరుద్ధరించుకుని.. ఇమ్రాన్ ఖాన్ ఫొటోతో పాటు హ్యాకర్ పెట్టిన ట్వీట్‌ను డెలీట్ చేశారు. ఐతే తన అకౌంట్ హ్యాక్ కావడం గురించి అమితాబ్ వేరే ట్వీట్ ఏమీ పెట్టలేదు. ఆయన ఏమీ జరగనట్లే ఉన్నారు.

ఒక విదేశీయుడు భేల్  పూరి చేస్తన్న వీడియో ఒకటి షేర్ చేసిన ఆయన.. హిందీలో ఒకటి రెండు ట్వీట్లు వేశారు. రాత్రి కొంచెం కంగారు పడ్డ అమితాబ్ ఫాలోవర్లు ఉదయానికి అమితాబ్ లైన్లోకి రావడంతో హమ్మయ్య అనుకున్నారు. ఈ లోపు హ్యాకర్ వేసిన ట్వీట్ కింద భారత్, పాకిస్థాన్ నెటిజన్లు చిన్నపాటి యుద్ధం చేసేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English