లిప్ లాక్స్ చేస్తానన్నా క్యారెక్టర్లు ఇవ్వట్లేదట

లిప్ లాక్స్ చేస్తానన్నా క్యారెక్టర్లు ఇవ్వట్లేదట

దక్షిణాది సినిమాల్లో నటించేటపుడు తాప్సి యాక్టింగ్ టాలెంట్‌ను ఎవ్వరూ గుర్తించలేదు. తెలుగులో తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ మొదలుకుని.. ఇక్కడ దాదాపుగా అన్నిట్లోనూ గ్లామర్ క్యారెక్టర్లే చేసింది. ఈ విషయంలో ఆమె ఎంత ఫీలైందో తర్వాతి రోజుల్లో అందరికీ తెలిసింది. బాలీవుడ్‌కు వెళ్లాక పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లలో చెలరేగిపోయిందామె. ఐతే ఇప్పుడు ఆమెకు ఆ తరహా పాత్రలు చేసి ఒకింత బోర్ కొట్టేస్తోందట.

తాప్సి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తుందన్న ముద్ర పడిపోవడంతో తనకు బాలీవుడ్లో గ్లామర్ క్యారెక్టర్లు ఇవ్వడం లేదని వాపోయింది తాప్సి. తాను మిగతా గ్లామర్ హీరోయిన్లలాగే లిప్ లాక్స్ చేయడానికి రెడీ.. సెక్సీగా స్టెప్పులేయగలను అంటున్నా కూడా ఏ డైరెక్టర్ తనను ఆ యాంగిల్లో చూడట్లేదని తాప్సి అంది. దక్షిణాదిన తాను చేసిన సినిమాలు చూసి అయినా భవిష్యత్తులో బాలీవుడ్లో గ్లామర్ క్యారెక్టర్లు ఇస్తారేమో చూడాలని తాప్సి అంది.

ఇక గత కొన్నేళ్లలో దక్షిణాది సినిమాలకు దూరం కావడంపై తాప్సి స్పందిస్తూ... ఒకే సమయంలో వివిధ భాషల్లో నటించడం కుదరదని అంది. దక్షిణాది నుంచి తనకు కొన్ని అవకాశాలు వచ్చినా విడిచిపెట్టానంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సౌత్ నుంచి తన దగ్గరికి ఎగ్జైటింగ్ స్టోరీలు, క్యారెక్టర్లు వస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట అశ్విన్ శరవణన్ చెప్పిన ‘గేమ్ ఓవర్’ కథ విపరీతంగా నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చానంది.

హిందీలో ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ విడుదల చేస్తున్నట్లు తాప్సి వెల్లడించింది. ‘గేమ్ ఓవర్’లో తాను 60 శాతం సినిమాలో వీల్ ఛైర్ మీదే కనిపిస్తానని.. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించానని తాప్సి చెప్పిింది. ఇక పెళ్లి గురించి అడిగితే.. తనకు పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినపుడు చేసుకుంటానని తాప్సి ఒక్క మాటలో తేల్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English