బెల్లంకొండకి అమెజాన్‌ దెబ్బ!

బెల్లంకొండకి అమెజాన్‌ దెబ్బ!

తమిళంలో విజయవంతమయిన రాక్షసన్‌ సినిమా తెలుగులో చేయడానికి పలువురు యువ హీరోలు ఆసక్తి చూపించారు. నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ తదితరులు ఈ చిత్రం కోసం ఆరా తీసారు. నితిన్‌ అయితే రైట్స్‌ కొనడానికి కూడా ట్రై చేసాడు. అయితే ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో చాలా మంది చూసేసి వుంటారని ఫీడ్‌బ్యాక్‌ రావడంతో ఇక రీమేక్‌ దండగ అని వదిలేసారు. ఆ సమయంలో దీనిని చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్‌ ముందుకొచ్చాడు. స్టార్‌ డైరెక్టర్లు ఎవరూ ఆసక్తిగా లేకపోవడంతో రమేష్‌ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు తీస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో లేని సన్నివేశాలు, ముఖ్యంగా విలన్‌కి సంబంధించిన సీన్లు, కిడ్నాప్‌లు, హత్యలకి సంబంధించిన సీన్లు తమిళంనుంచి యథాతధంగా ఎత్తేసారట. ఫుటేజీ కూడా వాడుకుంటామని ఒప్పందం చేసుకోవడంతో ఇలా తమిళ సీన్లు యాజిటీజ్‌గా వాడుకున్నారట.

ఇప్పుడు అమెజాన్‌ దెబ్బ ఈ చిత్రానికి ఇంకా బలంగా తగులుతుందని అంటున్నారు. ఆల్రెడీ ఒరిజినల్‌ చూసిన వారు ఆ సీన్లు అలాగే లేపేసి ఇక్కడ పెట్టారని తెలిస్తే మామూలుగా కంటే ఎక్కువ నెగెటివ్‌గా రియాక్ట్‌ అవుతుంటారు. శంకర్‌దాదా జిందాబాద్‌లో గాంధీజీ సీన్లకి అలాగే చేసి మూల్యం చెల్లించుకున్నారు. తమిళ సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా వుంటుంది కనుక ఆ సీన్లు వాడుకున్నా క్షమిస్తారా లేక కనీసం తిరిగి ఇంకోసారి తీయలేకపోయారని తిట్టి పోస్తారా అనేది రాక్షసుడి ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English