మెగా హీరో రచ్చ... కారణం క్రిష్‌!

మెగా హీరో రచ్చ... కారణం క్రిష్‌!

హిందీలోకి అనువాదమయ్యే తెలుగు సినిమాలకి యూట్యూబ్‌లో భలే గిరాకీ వుందనేది తెలిసిందే. అయితే అనువాదమయిన అన్ని సినిమాలకీ విపరీతమైన స్పందన రాదు. కొన్ని సినిమాలు మాత్రమే వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం 'కంచె' అనువాదమయిన 'కిలాడీ కీ జంగ్‌' చిత్రం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్‌ ఛానల్‌ ద్వారా యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన కంచె హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ మూడు రోజుల్లో నాలుగు మిలియన్లకి పైగా వ్యూస్‌ రాబట్టుకుని  యాభై లక్షలకి చేరువ అవుతోంది.

రెండవ ప్రపంచ యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కథతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌ ఆడియన్స్‌ని బాగా మెప్పిస్తోంది. ఈ చిత్రానికి మణికర్ణిక దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహించాడనే టాక్‌ కూడా కంచె యూట్యూబ్‌లో ఇంతటి సంచలనం కావడానికి కారణమయింది. ఈ చిత్రం చూసిన వారు క్రిష్‌ని పొగుడుతూ కంగన రనౌత్‌ని తిట్టి పోస్తున్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన దర్శకుడిని పెట్టుకుని అతడికి దర్శకత్వం రాదన్నట్టుగా మాట్లాడి అతడిని అవమానించడం ఏమిటని కంగనకి అక్షింతలు వేస్తున్నారు. మణికర్ణిక టైమ్‌లో తనకి రావాల్సిన క్రెడిట్‌ రాలేదని క్రిష్‌ బాధ పడినా కానీ ఈ చిత్రానికి వస్తోన్న స్పందనతో అతను హ్యాపీగా వుండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English