గ్యాంగ్‌ లీడర్‌ ప్లాన్‌ బోల్తా కొట్టింది

గ్యాంగ్‌ లీడర్‌ ప్లాన్‌ బోల్తా కొట్టింది

నాని హీరోగా విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రంలో విలన్‌ పాత్ర చాలా ఇంపార్టెంట్‌ అట. ఒక యంగ్‌ యాక్టర్‌ కోసం వెతుకుతూ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ వచ్చిన కార్తికేయని తీసుకున్నారు. ఆర్‌ఎక్స్‌ 100తో నిజంగానే యువతకి దగ్గరయ్యాడనే భావన కలిగించిన కార్తికేయ అసలు రంగు 'హిప్పీ'తో బయట పడింది. నటన సరిగ్గా రాదు కనుక చొక్కా విప్పి బాడీ చూపిస్తూ కానిచ్చేసాడు హిప్పీ. ఆర్‌ఎక్స్‌ 100 హీరో కనుక అతను విలన్‌ అంటే క్రేజ్‌ యాడ్‌ అవుతుందని ఏరి కోరి అతడిని పెట్టుకుంటే అతనిప్పుడు హిప్పీ హీరో అవడంతో విక్రమ్‌ కుమార్‌ ప్లాన్‌ బోల్తా కొట్టింది.

ఈ చిత్రానికి కార్తికేయ వల్ల యాడ్‌ అయ్యేది అంటూ ఏమీ వుండదు కానీ అతని కెరియర్‌ నిలబడేందుకు ఈ చిత్రం పనికొస్తుంది. కేవలం హీరోగానే నటిస్తాననే షరతులు పెట్టుకోకుండా ఎలాంటి క్యారెక్టర్‌ వచ్చినా చేసేందుకు గ్యాంగ్‌లీడర్‌ అతనికి హెల్ప్‌ అవుతుంది. మరెవరైనా ఫామ్‌లో వున్న యువ హీరోని విలన్‌గా తీసుకుని వుంటే గ్యాంగ్‌లీడర్‌కి అదనపు బలంగా వుండేది. ఇప్పుడిక నాని మాత్రమే ఈ చిత్రానికి అన్నీ కావాలి. షూటింగ్‌ చివరి దశకి చేరుకున్న ఈ చిత్రం ఆగస్టు నెలాఖరులో విడుదలకి సిద్ధమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English