డెబ్బయ్‌కి దిగనంటోన్న బోయపాటి!

డెబ్బయ్‌కి దిగనంటోన్న బోయపాటి!

బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చిత్రం బడ్జెట్‌ సమస్యల వలనే ముందుకి కదలలేదు. ఈ చిత్రాన్ని ముందుగా బాలకృష్ణ నిర్మించాలని భావించినా కానీ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ డిజాస్టర్‌ అవడంతో ఆ చిత్రంతో నష్టపోయిన వారంతా దీనిపై పడతారనే భయంతో వద్దనుకున్నారు. వేరే నిర్మాతని ఓకే చేద్దామంటే బోయపాటి శ్రీను సింపుల్‌గా డెబ్బయ్‌ కోట్ల బడ్జెట్‌ ఇచ్చాడట. ఇది కేవలం మొదలు పెట్టడానికి వేసిన ఎస్టిమేషన్‌ కనుక ఒక పది కోట్లు అటే వెళుతుంది కానీ ఇటు తగ్గదన్నమాట.

బడ్జెట్‌ యాభై కోట్లకి కుదిస్తే ఈ చిత్రాన్ని నిర్మించడానికి అనిల్‌ సుంకర, దిల్‌ రాజు లాంటి వాళ్లు ఆసక్తిగానే వున్నారు కానీ బోయపాటి మాత్రం డెబ్బయ్‌కి తగ్గేది లేదంటున్నాడట. తాను విజువలైజ్‌ చేస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రానికి కనీసం డెబ్బయ్‌ కోట్ల బడ్జెట్‌ అవుతుందని బోయపాటి చెప్పడంతో ఈ చిత్రం ముందుకి కదలడం లేదట. తానే ఒక నిర్మాతని తీసుకుని వస్తానని బాలయ్యకి బోయపాటి చెప్పాడట. దీంతో కె.ఎస్‌. రవికుమార్‌ చిత్రంతోనే బాలయ్య కంటిన్యూ అయిపోతున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English