ఇంకో మూడు వందల కోట్లు గ్యారెంటీ

ఇంకో మూడు వందల కోట్లు గ్యారెంటీ

బాహుబలి రికార్డుని ఇంకా కొట్టలేదేమో కానీ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కి మాత్రం సల్మాన్‌ ఖానే బాహుబలి. వంద కోట్ల క్లబ్‌ స్టార్ట్‌ అయినపుడు అత్యధిక వంద కోట్ల చిత్రాలని చేసిన హీరోగా సల్మాన్‌ చరిత్ర సృష్టించాడు. రెండు వందల కోట్ల క్లబ్‌లో కూడా అతనిది తొలి సినిమా కాదు. కానీ ఒక్కసారి రెండు వందల కోట్ల క్లబ్‌ స్టార్ట్‌ అయ్యాక ఆ మార్కుని ఈజీగా దాటేస్తున్నాడు. అలాగే మూడు వందల కోట్ల క్లబ్‌లో కూడా సల్మాన్‌ మొదటిగా అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు మరో హీరో ఎవరికీ లేనన్ని మూడొందల కోట్ల సినిమాలు అతని ఖాతాలో వున్నాయి.

టైగర్‌ జిందా హై, బజరంగి భాయ్‌జాన్‌, సుల్తాన్‌ చిత్రాలతో మూడు వందల కోట్లు సాధించిన సల్మాన్‌ మరోసారి ఆ మార్కు చేరుకోవడం కోసం దూసుకుపోతున్నాడు. భలేగా కలిసి వచ్చిన రంజాన్‌ సీజన్‌లో విడుదల చేసిన అతని తాజా చిత్రం 'భారత్‌' తొలి వారాంతంలోనే నూట యాభై కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. సోమవారం వసూళ్లు కూడా చాలా బాగున్నాయనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ఒకవైపు షారుక్‌ ఖాన్‌ చిత్రాలకి వంద కోట్ల నెట్‌ రావడం కూడా గగనమైపోతోంటే, అమీర్‌ ఖాన్‌ 'దబాంగ్‌' తర్వాత స్లో అయిపోతే సల్మాన్‌ మాత్రం కోట్లు రాబట్టడం తనకి చిటికెలో పని అంత తేలికన్నట్టు హల్‌చల్‌ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English