తమ్ముడిని గాలికి వదిలేసిన హీరో

తమ్ముడిని గాలికి వదిలేసిన హీరో

తన కాళ్ల మీద తాను నిలబడి పెద్ద స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండ ఈ తరానికి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇంత ఎత్తుకి ఎదిగిన హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్‌ పేరు చెబితే వారసత్వ నటనకి దూరంగా రియల్‌ టాలెంట్‌ అంటూ మాట్లాడుతుంటారు. అయితే ఫ్యామిలీలో ఒకరు హీరో అయితే వెనక ఇంకొకరు వచ్చేయడం ఇక్కడ రివాజు. అలాగే విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా హీరో అయ్యాడు. అయితే అతనికి ఆఫర్‌ ఇవ్వమని కానీ, లేదా అతను చేసే సినిమా కథ ఏమిటనేది కానీ విజయ్‌ ఎవరినీ అడగలేదు, అతని సినిమాని అసలు పట్టించుకోలేదు.

తమ్ముడికి ఏ విధమైన సపోర్ట్‌ ఇవ్వడానికి విజయ్‌ దేవరకొండ ఇష్టపడడం లేదు. నిజంగా అతనికి టాలెంట్‌ వుంటే తప్పకుండా సక్సెస్‌ అవుతాడని, సక్సెస్‌ అయినపుడు తాను కూడా సాయం చేయకుండా ఎదిగాడని చెబుతానని అంటున్నాడే తప్ప ఆనంద్‌ తొలి చిత్రం 'దొరసాని' కోసం ఒక ట్వీట్‌ కూడా వేయనంటున్నాడు. దేవరకొండ తమ్ముడిని పెట్టుకుంటే 'రౌడీ బ్యాచ్‌' సపోర్ట్‌ దక్కుతుందని, సినిమాకి సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ వస్తుందని మేకర్స్‌ ఆశించారు. కానీ విజయ్‌ దేవరకొండ తమ్ముడికి బూస్ట్‌ ఇచ్చే విషయంలో కూడా రౌడీలానే వ్యవహరిస్తున్నాడు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English