ఫ్లాప్‌ హీరోయిన్‌తో 'ప్రతి రోజూ పండగే'

ఫ్లాప్‌ హీరోయిన్‌తో 'ప్రతి రోజూ పండగే'

ఫ్లాప్‌ సినిమాల్లో నటించినంత మాత్రాన హీరోయిన్లకి అవకాశం ఇవ్వకూడదనేం లేదని, ఫ్లాపిచ్చిన వారితో కూడా హిట్‌ ఇవ్వవచ్చునని 'చిత్రలహరి'తో నిరూపించాడు సాయి తేజ్‌. అందులో కథానాయికలుగా నటించిన కళ్యాణి ప్రియదర్శన్‌, నివేతా పేతురాజ్‌ ఇద్దరికీ అదే ఫస్ట్‌ హిట్‌. ఇదే ఫార్ములాతో తదుపరి చిత్రానికి కూడా స్టార్‌ హీరోయిన్ల వెంట పడి, వారికో కోటి రూపాయలు చెల్లించుకోకుండా రుక్షర్‌ ధిల్లన్‌ని కథానాయికగా ఎంచుకున్నారు. మారుతి డైరెక్షన్‌లో 'ప్రతి రోజూ పండగే' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రుక్షర్‌కి ఛాన్స్‌ ఇచ్చారు.

కృష్ణార్జున యుద్ధం, ఏబిసిడి చిత్రాలతో ఫ్లాప్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నా కానీ అమ్మాయికి అందంతో పాటు నటన కూడా బాగానే తెలుసు కనుక, తక్కువ పారితోషికానికే నటిస్తుంది కనుక రుక్షర్‌ని తీసేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ చిత్రంలో సాయి తేజ్‌ ఒక సరదా పాత్రలో కనిపించబోతున్నాడు. శైలజారెడ్డి అల్లుడు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మారుతి ఈసారి కథపై ఎక్కువ వర్క్‌ చేసాడు. తన మార్కు వినోదం మిస్‌ అవకుండానే ఫ్యామిలీ డ్రామా పండేలా కథ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English