సురేష్ ప్రొడక్షన్స్ లోగో వెనుక స్టోరీ

సురేష్ ప్రొడక్షన్స్ లోగో వెనుక స్టోరీ

తెలుగు సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్‌ది ప్రత్యేక అధ్యాయం. ఇటీవలే ఆ సంస్థ 55వ వార్షికోత్సవం జరుపుకుంది. ఒక సంస్థకు ఇంతటి సుదీర్ఘ ప్రస్థానం ఉండటం ఆశ్చర్యకరం. ఏదో ఉంది అంటే ఉంది అనిపించుకోకుండా ఇప్పటికీ చురుగ్గా సినిమాలు నిర్మిస్తోందా సంస్థ. ఇండియా మొత్తంలో ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పోస్టర్ మీద సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ లోగో చూస్తే ప్రేక్షకులకు ఆ చిత్రం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అది. ఇంతటి ప్రత్యేకత ఉన్న బేనర్‌కు సంబంధించిన లోగో రూపొందించడం వెనుక కూడా ఒక ఆసక్తికర కథ ఉంది. ఆ కథను నిర్మాత సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్ లోగోలో కనిపించే ఇద్దరు పిల్లల్లో ఒకరు నేను. ఇంకొకరు తమ్ముడు వెంకటేష్‌. ఒక రోజు నేను, వెంకటేష్‌ స్కూలుకి రెడీ అవుతుంటే, నాన్న పిలిచారు. అక్కడ ఎస్, పి అక్షరాలతో తయారు చేసిన బొమ్మల మీద నిలబడమని చెప్పారు. ఫొటోలు తీయించి.. వాటితోనే లోగో తయారు చేయించారు. యాదృచ్ఛికంగా ‘ఎస్‌’పై వెంకటేష్‌ నిలబడ్డాడు. ‘పి’పై నేను నిలబడ్డా. ‘ఎస్‌’పై ఉన్న వెంకటేష్‌ స్టార్‌ అయితే, ‘పి’పై ఉన్న నేను ప్రొడ్యూసర్‌ అయ్యా. నిజానికి నాకు చిన్నప్పటి నుంచీ సినిమాల మీద ఆసక్తి లేదు. నాన్నగారు తాను నిర్మించిన సినిమాలకు సంబంధించిన రోజువారీ కలెక్షన్ల గురించి రోజూ నోట్ రాసి ఇస్తే.. దాన్ని నేను నోట్ బుక్‌లోకి కాపీ చేసేవాడిని. ఆ తర్వాత ప్రొడక్షన్లో వేరే పనులు కూడా చూశాను. అలా నాకు తెలియకుండానే నిర్మాణ రంగంవైపు అడుగులు వేశా. చివరికి నిర్మాతగా సెటిల్ అయిపోయా. కానీ ఇంత అనుభవం వచ్చినా సినిమా గురించి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది’’ అని సురేష్ బాబు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English