బాలయ్య.. అది గ్యారెంటీ, ఇదే డౌటు

బాలయ్య.. అది గ్యారెంటీ, ఇదే డౌటు

ఒక స్టార్ హీరో కొత్తగా ఏ సినిమాలు చేస్తున్నాడనే సమాచారంపై స్పష్టత కావాలంటే.. అతడి పుట్టిన రోజు వచ్చే వరకు ఆగాలి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమాలు అనౌన్స్ చేయడం, ప్రారంభోత్సవం జరిపించడం కామన్. అంతే కాక.. ఆ హీరోతో సినిమాలు కమిటైన నిర్మాతలు శుభాకాంక్షలు చెబుతూ ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. మామూలుగా బాలయ్య పుట్టిన రోజుకు నిర్మాతల శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటాయి. ఈసారి అవి తక్కువే ఉంటాయి. బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు కన్ఫమ్ చేస్తూ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన నిర్మాత ఒక్కరు మాత్రమే. ఆయనే సి.కళ్యాణ్. ‘జై సింహా’ తర్వాత బాలయ్యతో మరో సినిమాకు కమిట్మెంట్ తీసుకున్న కళ్యాణ్.. ముందు వి.వి.వినాయక్‌ను దర్శకుడిగా అనుకున్నాడు. కానీ వినాయక్ బాలయ్యను మెప్పించే కథ రెడీ చేయలేకపోయాడు.

తర్వాత ‘జై సింహా’ దర్శకుడు కె.ఎస్.రవికుమారే మళ్లీ బాలయ్యను మెప్పించి సినిమాకు ఒప్పించాడు. ఐతే ఈపాటికే మొదలు కావాల్సిన ఈ చిత్రంపై ఇటీవల సందేహాలు నెలకొన్నాయి. దీని కథను మార్చాల్సిన అవసరం ఏర్పడిందని.. దీన్ని హోల్డ్ చేసి బోయపాటి సినిమాను బాలయ్య మొదలు పెడతాడని ఊహాగానాలు వినిపించాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం అదేమీ లేదని.. త్వరలోనే రవికుమార్ సినిమాను బాలయ్య మొదలుపెడతాడని స్పష్టమైంది.

బాలయ్య-రవికుమార్ కాంబినేషన్లో సినిమా పోస్టర్‌తో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి అందులో ‘ఎన్బీకే 105’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టడం ద్వారా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు ధ్రువీకరించాడు కళ్యాణ్. మరోవైపు బోయపాటి-బాలయ్య సినిమా గురించి ఏ ఊసూ లేదు. ఈ సినిమాను ముందు బాలయ్యే స్వయంగా నిర్మించాలనుకున్నాడు. కానీ ‘యన్.టి.ఆర్’ ఫలితం చూశాక నిర్ణయం మార్చుకున్నాడు. దిల్ రాజు చేేతికి ీఈ సినిమా వెళ్లినట్లు వార్తలొచ్చాయి. కానీ అదీ కన్ఫమ్ కాలేదు. బోయపాటి కానీ.. ఏ నిర్మాత కానీ బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాను ధ్రువీకరించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English