మరీ టూమచ్‌ రాజమౌళి గారూ

మరీ టూమచ్‌ రాజమౌళి గారూ

రాజమౌళి సినిమా అనౌన్స్‌ అయిందంటేనే ఒక భారీ బ్లాక్‌బస్టర్‌ వస్తుందని ఫిక్స్‌ అయిపోవచ్చు. తన సినిమాలో ఏమి ఉంటే ప్రేక్షకులు మెచ్చుకుంటారో ఎంతో ఆలోచించి మరీ తెరకెక్కించే రాజమౌళి ఈమధ్య సినిమాకో రకమైన నేపథ్యాన్ని ఎంచుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రం ‘బాహుబలి’కి రాజులు, రాజ్యాల నేపథ్యం ఎంచుకున్నారనే సంగతి తెలిసిందే.

ఇందులో ఆనాటి రాజుల్ని తలపించేలా హీరోలని గుబురు గడ్డంతో, జులపాల జుట్టుతో చూపించాలరాజమౌళి భావిస్తున్నాడు. ఇంతవరకు హీరో ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉండాలనేది ఫిక్స్‌ కాలేదు. అతను కెప్టెన్‌ ఆజ్ఞల మేరకు గడ్డం, జుట్టు పెంచుకుంటూ పోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ తన బాడీ కూడా పెంచేశాడు. దీంతో అందగాడైన ప్రభాస్‌ కాస్తా భయంకరంగా కనిపిస్తున్నాడు. అతని కొత్త స్టిల్‌ ఒక్కోటీ వచ్చే కొద్దీ ఫాన్స్‌ కూడా వర్రీ అవుతున్నారు. ఆ లుక్కేదో తొందరగా తేల్చేసి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ స్టిల్లొకటి వదిలేస్తే చాలని రాజమౌళిని కోరుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు