'సరిలేరు నీకెవ్వరు'లో వెంకీ కామెడీ!

 'సరిలేరు నీకెవ్వరు'లో వెంకీ కామెడీ!

రవితేజ నటించిన వెంకీ చిత్రం అంతగా హిట్టవలేదు కానీ అందులోని ట్రెయిన్‌ ఎపిసోడ్‌ మాత్రం పిచ్చ హిట్టయింది. ట్రెయిన్‌లోనే వినోదం మొత్తం పండించిన శ్రీను వైట్ల కామెడీ ఎపిసోడ్స్‌లో అదొక ఆణిముత్యంగా మిగిలిపోయేలా తెరకెక్కించాడు. ఆ తర్వాత వెంకీ మాదిరిగా సుదీర్ఘమైన కామెడీతో జర్నీ ఎపిసోడ్స్‌ తీయాలని ట్రై చేసి చాలా మంది ఫెయిలయ్యారు. కానీ అనిల్‌ రావిపూడి తన కొత్త సినిమాలో అది ట్రై చేస్తున్నాడు.

మహేష్‌తో రావిపూడి తెరకెక్కిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు'లో ఫస్ట్‌ హాఫ్‌ చాలా సమయం ట్రెయిన్‌లో వుంటుందట. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీతో పాటు పలువురు కమెడియన్లతో సిట్యువేషనల్‌ కామెడీ కూడా చాలానే వుంటుందట. ఈ ఎసిసోడ్‌ కోసం స్టార్‌ కమెడియన్లు చాలా మందివి బల్క్‌ డేట్స్‌ తీసుకున్నారని, అలాగే ఒక ట్రెయిన్‌ సెట్‌ కూడా వేస్తున్నారని సమాచారం. రియల్‌గా ట్రెయిన్‌లో కూడా కొన్నాళ్లు షూటింగ్‌ చేసి ఆ తర్వాత సెట్‌లో మిగతా భాగం తీస్తారట.

ఈ చిత్రంలో మహేష్‌ ఎలాంటి సందేశాలు ఇవ్వకుండా పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో హాయిగా నవ్విస్తాడట. మహేష్‌కి ఎలాంటి ఇమేజ్‌ వున్నా కానీ కామెడీనే తన సినిమాలని అంత హిట్‌ చేసింది కాబట్టి రావిపూడి ఆ విషయంలో అసలు రాజీ పడడం లేదట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English