హీరోయిన్లని అదుపులో పెడుతోన్న నాని!

హీరోయిన్లని అదుపులో పెడుతోన్న నాని!

ఈమధ్య కాలంలో నాని చిత్రాలతో పరిచయం అయినంత మంది హీరోయిన్లు మరే హీరోతోను పరిచయం కాలేదు. ప్రతి సినిమాలోను కొత్త హీరోయిన్లని పరిచయం చేయడానికే నాని ఆసక్తి చూపిస్తాడు. ఎప్పుడో కానీ హీరోయిన్లని రిపీట్‌ చేయడానికి, ఆల్రెడీ ఫీల్డులో వున్న వారిని తీసుకోవడానికి ఇష్టపడడు. ఇందుకు ఓ కారణం వుందట. నాని సినిమాలకి తన పారితోషికం మినహా మిగతా ఖర్చులన్నీ కంట్రోల్‌లో వుండాలనేది ఖచ్చితమైన రూల్‌ అట.

తన సినిమాకి ఎంత బడ్జెట్‌ పెడుతున్నారు, ఎంతకి అమ్ముతున్నారు అనేది నాని తప్పకుండా తెలుసుకుంటాడట. తన మార్కెట్‌ ఎంత, ఒకవేళ సినిమా అంచనాలకి తగ్గట్టు లేకపోతే బయ్యర్లకి వుండే రిస్కెంత లాంటివి చూసుకుంటాడట. అందుకే తన చిత్రాలకి స్టార్‌ దర్శకులు వుండాలని నాని కోరుకోడు. స్టార్‌ డైరెక్టర్లు హీరోతో సమానంగా డబ్బులు అడుగుతారు. అలాగే పేరున్న హీరోయిన్లని తీసుకుంటే వారికీ పారితోషికం భారీగా ఇవ్వాలి.

అదే కొత్త హీరోయిన్‌ అయితే చేతికొచ్చే డబ్బుల కంటే వచ్చిన ఛాన్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తుందని కొత్తవారిని తీసుకోమని నాని ప్రోత్సహిస్తాడు. తన సినిమాల బడ్జెట్‌ లెక్కల గురించి కూడా ఇంతగా పట్టించుకుంటాడు కనుకే సెకండ్‌ టయర్‌ హీరోల్లో నాని అంత పెద్ద స్టార్‌ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English