మ‌హ‌ర్షి మ‌త్తు వ‌ద‌ల‌ని మ‌హేష్‌

మ‌హ‌ర్షి మ‌త్తు వ‌ద‌ల‌ని మ‌హేష్‌

మ‌హేష్ బాబు కెరీర్లో ఇండ‌స్ట్రీ హిట్లున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్లున్నాయి. సూప‌ర్ హిట్లున్నాయి. కానీ కెరీర్లో ఇప్పుడే తొలి హిట్ అందుకున్నంత హంగామా చేస్తున్నాడత‌ను. 'మ‌హ‌ర్షి' విష‌యంలో మ‌హేష్ ఎగ్జైట్మెంట్ అంద‌రికీ చాలా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. విడుద‌ల‌కు ముందు, త‌ర్వాత మ‌హేష్ బాబు ఈ సినిమా గురించి ఊద‌ర‌గొట్టేశాడు. ఇంత కంటే గొప్ప సినిమా ఏదీ తాను చేయ‌న‌ట్లు మాట్లాడాడు. కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అన్న‌ట్లు ప్రొజెక్ట్ చేసుకున్నాడు.

నాలుగు వారాలుగా మ‌హేష్ ఏ ట్వీట్ వేసినా.. దాని వెనుక 'సెల‌బ్రేటింగ్ మ‌హ‌ర్షి' అనే హ్యాష్ ట్యాగ్ కంప‌ల్స‌రీగా క‌నిపిస్తోంది. కుటుంబంతో క‌లిసి ఫారిన్ టూర్‌కు వెళ్లిన అత‌ను అక్క‌డ కూడా 'మ‌హ‌ర్షి'ని వ‌ద‌ల‌ట్లేదు. షేర్ చేసే ప్ర‌తి ట్వీట్ వెనుక 'సెల‌బ్రేటింగ్ మ‌హ‌ర్షి' ట్యాగ్ జోడిస్తున్నాడు. మొన్న‌క రోజు కొడుకు గౌత‌మ్‌ను హ‌త్తుకుని మురిసిపోతూ దానికి కూడా ఇదే హ్యాష్ ట్యాగ్ పెట్టాడు.

ప్ర‌స్తుతం మ‌హేస్ యూర‌ప్ టూర్లో ఉన్నాడు. ముందు జ‌ర్మ‌నీలో ప‌ర్య‌టించిన అత‌ను.. ఆ త‌ర్వాత ఇట‌లీకి వెళ్లాడు. అక్క‌డి నుంచి లండ‌న్ చేరుకున్నాడు. ఆదివారం అత‌ను ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌కు హాజర‌వుతాడ‌ట‌. మ‌రి ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తూ కూడా 'సెల‌బ్రెటింగ్ మ‌హ‌ర్షి' అని హ్యాష్ ట్యాగ్ జోడిస్తాడేమో అని కౌంట‌ర్లు వేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ప్ర‌స్తుతం టాలీవుడ్లో పెద్ద హీరోలెవ‌రూ వ‌సూళ్ల గురించి మాట్లాడ‌ట్లేదు.

కానీ మ‌హేష్ ప‌దే ప‌దే 'మ‌హ‌ర్షి' వ‌సూళ్ల గురించి, రికార్డుల గురించి ఊద‌ర‌గొడుతుండ‌టం.. రిక‌వ‌రీ ప‌రంగా యావ‌రేజ్ అనిపిస్తున్న‌ ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ప్రూవ్ చేయ‌డానికి అదే ప‌నిగా ప్ర‌య‌త్నిస్తుండ‌టం సోష‌ల్ మీడియాలోని త‌ట‌స్థుల‌కు కూడా విసుగు తెప్పిస్తోంది. దాదాపుగా థియేట‌ర్ల నుంచి లేచిపోయిన 'మ‌హ‌ర్షి' మాయ‌లోంచి మ‌హేష్ ఇక బ‌య‌టికి వ‌చ్చేసి త‌ర్వాతి సినిమా మీద ఫోకస్ పెడితే బెట‌రేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English