దేవిశ్రీ తమ్ముడి కొత్త అవతారం

దేవిశ్రీ తమ్ముడి కొత్త అవతారం

దశాబ్దంన్నర నుంచి గాయకుడిగా కొనసాగుతున్నాడు సాగర్. ఇప్పటికీ అతడికంటూ సొంత గుర్తింపంటూ ఏమీ లేదు. గాయకుడిగా కొన్ని మంచి పాటలు పాడినప్పటికీ.. అతను అన్న చాటు తమ్ముడిగానే ఉన్నాడు. దేవిశ్రీ మాత్రమే అతడికి గాయకుడిగా అవకాశాలిస్తున్నాడు. అన్న వల్లే పాటలు పాడుతున్నాడు తప్ప.. సొంతంగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడన్న అభిప్రాయం జనాల్లో ఉంది. కొన్ని పాటలకు సాగర్ వాయిస్ సెట్ కాకున్నా.. అతడితో పాడించి విమర్శలు ఎదుర్కొన్నాడు దేవి. అయినా అతనేమీ పట్టించుకున్నది లేదు. సాగర్‌ టాలెంట్ గురించి అప్పుడప్పుడూ ప్రత్యేకంగా చెబుతుంటాడు దేవి. తాను, వేరే లిరిసిస్టులు రాసిన కొన్ని పాటలకు అతను అందించిన సహకారం గురించి కూడా కొన్ని సందర్భాల్లో వెల్లడించాడు. ఇప్పుడు దేవి తమ్ముడు మాటల రచయితగా కొత్త అవతారం ఎత్తుతుండటం విశేషం.

ఈ విషయాన్ని దేవినే స్వయంగా వెల్లడించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘రాక్షసుడు’కు మాటలు అందించింది సాగరేనట. డైలాగ్ రైటర్‌గా కొత్త పాత్రలోకి మారిన తన తమ్ముడిని ఆశీర్వాదించాలంటూ ఒక ట్వీట్ పెట్టాడు దేవి. ఈ చిత్రంతో దేవికి ఎలాంటి సంబంధం లేదు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాక్షసన్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌కు మ్యూజిక్ ఇచ్చిన జిబ్రానే దీనికీ పని చేశాడు. దేవితో పాటు సాగర్ కూడా చిన్నతనం నుంచి చెన్నైలో పెరిగిన వాళ్లే. ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. వీళ్లిద్దరికీ తమిళం మీద మంచి పట్టుంది. కాబట్టి మాటలు తమిళ రీమేక్‌కు మాటలు రాయడానికి సాగర్ పెద్దగా కష్టపడి ఉండకపోవచ్చు. కానీ అతడి డైలాగ్స్ ఎంత బావున్నప్పటికీ రీమేక్ కాబట్టి పేరు రాకపోవచ్చు. ఏదైనా స్ట్రెయిట్ మూవీతో తన పెన్ పవర్ చూపిస్తేనే సాగర్ గుర్తిింపు సంపాదించగలడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English