సినిమాలకి దూరంగా నందమూరి బాలకృష్ణ తనయుడు!

సినిమాలకి దూరంగా నందమూరి బాలకృష్ణ తనయుడు!

నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే అంటూ పలుమార్లు వార్తలు రాగా బాలకృష్ణ ఎప్పుడూ వాటిని ఖండించలేదు. అతడిని పరిచయం చేయడానికి ఇంకా సమయం వుందని మాత్రం చెప్పారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలకృష్ణ క్యారెక్టర్‌ని అతనితో చేయించాలనే ఆలోచన వచ్చినా విరమించుకున్నారు. బోయపాటి శ్రీను లేదా రాజమౌళి డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తొలి సినిమా వుంటుందని కొన్నాళ్లు, మహేష్‌, చరణ్‌లని పరిచయం చేసిన అశ్వనీదత్‌ బ్యానర్లోనే అతని సినిమా వుంటుందని ఇంకొన్నాళ్లు చెప్పుకున్నారు. కానీ ఇటీవల మోక్షజ్ఞ ఇక సినిమా రంగ ప్రవేశం చేయడంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు నటనలో తర్ఫీదు పొందడం కానీ, లేదా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై వర్క్‌ చేయడం కానీ మోక్షజ్ఞ చేసినట్టు లేడు.

కాఫీ షాప్‌లలో సగటు యువకుడిలా తిరుగుతూ కనిపిస్తున్నాడే తప్ప త్వరలో హీరోగా రంగప్రవేశం చేయాలని ఆరాట పడుతోన్న దాఖలాలు అయితే లేవు. బాలకృష్ణ కూడా తనయుడిని తొందరపెట్టడం కానీ, అతని ఇంట్రడక్షన్‌ సినిమా కోసం దర్శకులతో చర్చలు జరపడం కానీ చేయడం లేదు. ఒకవైపు అభిమానులేమో మోక్షజ్ఞ బర్త్‌డేకి బ్యానర్లు కట్టడం మానట్లేదు. త్వరలోనే అతను హీరోగా పరిచయమై నందమూరి వంశ ప్రతిష్టని ఇంకాస్త పెంచుతాడని ఆశిస్తున్నారు. తనయుడి సినీ రంగ ప్రవేశంపై వినిపిస్తోన్న రకరకాల రూమర్లకి బాలయ్య త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టి మోక్షజ్ఞ ఎంట్రీకి ఒక డేట్‌ ఫిక్స్‌ చేస్తారని ఆశిస్తున్నారు. ఎల్లుండి బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ అనౌన్స్‌మెంట్‌ వస్తుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English