జగన్‌ ఏమి చేసినా యూజ్‌ వుండట్లే

జగన్‌ ఏమి చేసినా యూజ్‌ వుండట్లే

కెరియర్‌ పరంగా ప్రమాద స్థాయిని దాటి కిందకి జారిన పూరి జగన్నాథ్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి అయితే ఇండస్ట్రీలో మంచి బజ్‌ వుంది. పూరి మునుపటి ఫామ్‌లో ఉన్నట్టయితే ఇది ఇంకో పోకిరి అవుతుందనే రేంజ్‌లో కథ గురించి టాక్‌ వినిపిస్తోంది. అయితే పూరీకి ఇటీవల మాస్‌ పల్స్‌ తెలియడం లేదు. ఇదివరకటిలా సటిల్‌గా మాస్‌ సీన్లు తీయలేకపోతున్నాడు. మరీ లౌడ్‌గా వుండే మాస్‌ సినిమాలే తీస్తున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ టీజర్‌లోను ఆ ఛాయలు డామినేట్‌ చేసాయి.

రామ్‌ అలా నోరంతా తెరిచి మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. అయితే ఈ చిత్రంలో మాస్‌ మసాలాలు దండిగా వున్నాయనేది నిన్న విడుదలైన పాటతోను స్పష్టమయింది. ఈ చిత్రం మాస్‌ని ఉర్రూతలూగిస్తుందనే సంకేతాలు పూరి బలంగా పంపిస్తున్నాడు. అయితే అతను ఎన్ని రకాలుగా దీనికి క్రేజ్‌ తేవాలని చూస్తున్నా బిజినెస్‌ పరంగా పెద్ద యూజ్‌ వుండట్లేదని ట్రేడ్‌ సర్కిల్స్‌ వాళ్లు చెబుతున్నారు. ట్రెయిలర్‌తో కూడా బజ్‌ ఏమీ పెరగదని, సినిమా చూసిన తర్వాతే ఇది ఏ రేంజ్‌కి వెళుతుందనే ఎస్టిమేట్‌ చేయవచ్చునని, పూరి ఆకర్షణీయమైన ట్రెయిలర్లు కట్‌ చేసి కూడా డిజాస్టర్లు ఇచ్చింది ఎవరూ మరచిపోతున్నట్టు లేరు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English