మహేష్‌తో చేయాలంటే ఆ మాత్రం వుండాలి!

మహేష్‌తో చేయాలంటే ఆ మాత్రం వుండాలి!

రాజకీయాలతో బిజీ అయిపోయి నటనకి పూర్తిగా దూరమయిన 'లేడీ అమితాబ్‌' విజయశాంతి ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ తెర మీదకి వస్తోంది. మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఇంతకాలం సినిమాలు లేక, ఎన్నికల ప్రచారాలతో ఎండ, వాన లెక్కలేకుండా తిరిగిన విజయశాంతి అప్పటి గ్లామర్‌, ఫిట్‌నెస్‌ కోల్పోయింది. అందుకే ఈ చిత్రం సెట్స్‌లోకి తాను వెళ్లే ముందే ఫిట్‌గా అవడానికి విజయశాంతి ఇప్పుడు బాగా కష్టపడుతోంది.

మహేష్‌ అసలే నడి నలభైలలోకి వెళుతోన్నా ఇంకా ముప్పయ్యేళ్ల వాడిలా కనిపిస్తుంటాడు కనుక అతని సినిమాలో మరీ ఏజ్డ్‌గా కనిపించడం రాములమ్మకి ఇష్టం లేనట్టుంది. అందులోను రాజకీయ పరంగా ఇప్పుడు తాను చేయడానికి కూడా ఏమీ లేదు కనుక ఇకపై సినిమా రంగంలో బిజీ కావాలని చూస్తోంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని ఆఫర్లు రావాలంటే ఇందులో ఆమె ఫిట్‌గా కనిపించాల్సి వుంటుంది మరి. విపరీతంగా ఒళ్లు చేసి, అసలు గ్లామర్‌ లేకుండా కనిపిస్తే సపోర్టింగ్‌ రోల్స్‌కి ఆ కాలపు స్టార్లకి అవకాశాలు రాని సమయమిది. ఇప్పటికీ గ్లామర్‌ మెయింటైన్‌ చేయడం వల్లే నదియా అంతగా బిజీ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English