అజిత్ అతణ్ని వదిలేసి ఇతడిపై పడ్డాడా?

అజిత్ అతణ్ని వదిలేసి ఇతడిపై పడ్డాడా?

తమిళంలో తిరుగులేని క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. అతడితో సినిమా తీయాలని పెద్ద పెద్ద దర్శకులు తపిస్తారు. ఐతే అజిత్ మాత్రం స్టార్ డైరెక్టర్ల కంటే ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ డైరెక్టర్లతోనే పని చేస్తుంటాడు. అజిత్ ఒక దర్శకుడిని నమ్మితే వరుసగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగులో ‘శౌర్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివతో తొలిసారి ‘వీరం’ కోసం జట్టు కట్టిన అజిత్.. అతడి పని తీరు నచ్చడం, ఆ చిత్రం కూడా హిట్టవడంతో వరుసగా అతడి కాంబినేషన్లో సినిమాలు చేశాడు. వీరి కలయికలో ఆ తర్వాత వచ్చిన ‘వేదాలం’ కూడా హిట్టయింది. ‘వివేగం’ పోయినా.. ‘విశ్వాసం’ మళ్లీ బ్లాక్ బస్టర్ అయింది. ఐతే శివతో అజిత్ సినిమా అంటే అభిమానులు కూడా విసుగెత్తిపోయిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ కాంబినేషన్‌కు బ్రేక్ పడ్డట్లే ఉంది.

వరుసగా మాస్ మసాలా సినిమాలు చేసి అలసిపోయిన అజిత్ వైవిధ్యం కోసం ‘పింక్’ రీమేక్‌లో నటించాడు. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రలో అజిత్  కనిపించాడు. అజిత్ ఇలాంటి పాత్ర చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. బోనీ కపూర్ ఆబ్లిగేషన్ మీద ఈ సినిమా చేసినట్లున్నాడు అజిత్. ‘ఖాకి’ ఫేమ్ వినోద్ దర్శకత్వం వహించాడీ చిత్రానికి. ఐతే ‘పింక్’ రీమేక్ షూటింగ్ సమయంలో వినోద్ పని తీరుకు అజిత్ ఫిదా అయిపోయి.. అతడితో వెంటనే ఇంకో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. వినోద్ కూడా అజిత్‌తో డైరెక్ట్ మూవీ చేయాలనే ప్రయత్నించాడు. మధ్యలో అనుకోకుండా ‘పింక్’ రీమేక్ చేయాల్సి వచ్చింది. ఐతే దీని మేకింగ్ టైంలోనే తాను అనుకున్న కొత్త పాయింట్‌ను అజిత్‌కు చెప్పి ఒప్పించేశాడట వినోద్. ‘పింక్’ రీమేక్‌ను కేవలం రెండు నెలల్లో పూర్తి చేసి పక్కన పెట్టేసిన అజిత్-వినోద్.. కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. ఈ రెండు సినిమాలూ హిట్టయితే శివతో మాదిరే వినోద్‌తో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతాడేమో అజిత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English