అతను కూడా కంగన దెబ్బ రుచి చూశాడా?

అతను కూడా కంగన దెబ్బ రుచి చూశాడా?

బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌తో పని చేసిన చాలామంది రచయితలు, దర్శకులు, నటీనటులు ఆమె వల్ల ఇబ్బంది పడ్డవారే. కాస్త ముందో వెనుకో కంగనాతో పని చేయడంపై పలువురు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మన క్రిష్ జాగర్లమూడి ఆమెతో ‘మణికర్ణిక’ తీసి ఎంతగా ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. సినిమా పూర్తయ్యాక ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కంగనా.. అతడిని పక్కకు తప్పించి తనే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద స్థాయిలోనే వివాదం నడిచింది. దీని తర్వాత కూడా కంగనా యాదృచ్ఛికంగా ఒక తెలుగు దర్శకుడితోనే పని చేసింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో కంగనా ‘మెంటల్ హై క్యా’ అనే సినిమా చేసింది. ప్రకాష్ భార్య కనిక థిల్లాన్ ఈ చిత్రానికి స్క్రిప్టు సమకూర్చింది.


ఐతే దర్శకుడిగా ప్రకాష్ ట్రాక్ రికార్డేంటో తెలిసిందే. ‘అనగనగా ఓ ధీరుడు’, ‘సైజ్ జీరో’ లాంటి డిజాస్టర్లు అందించాడతను. అలాంటి దర్శకుడిని కంగనా ఎలా నమ్మిందో.. అతను సినిమా ఎలా తీశాడో.. కంగనాను ఏమేరకు మెప్పించాడో అనే సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. ఈ సందేహాలకు తగ్గట్లే షూటింగ్ పూర్తయ్యాక ఔట్ పుట్ విషయంలో కంగనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తుండటం విశేషం. ఈ విషయంలో కంగనాకు.. ప్రకాష్‌-కనిక జోడీకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లుగా చెప్పుకుంటున్నారు. నిర్మాతల ఒత్తిడి మేరకు ప్రకాషే కొంచెం తగ్గాడని.. కంగనా అభీష్టం మేరకు రీషూట్లు జరగడం వల్లే జూన్ నుంచి జులైకి సినిమా వాయిదా పడిందని అంటున్నారు. వ ఇదే విషయాన్ని ప్రకాష్ దగ్గర ప్రస్తావిస్తే.. ఈ వార్తల్ని ఖండించాడు. కంగనాతో తనకెలాంటి ఇబ్బందులూ లేవన్నాడు. ‘మెంటల్ హై క్యా’కు రీషూట్లు ఏమీ జరగలేదన్నాడు. ఔట్ పుట్ విషయంలో అందరూ సంతృప్తిగా ఉన్నారు. మరి రిలీజ్ డేట్ ఎందుకు మార్చారంటే అది నిర్మాతల నిర్ణయం అని మాట దాటవేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English