జిలేలమ్మా జిట్టా.. ఇట్టా ఉంటే ఎట్టా?

జిలేలమ్మా జిట్టా.. ఇట్టా ఉంటే ఎట్టా?

ధిమ్మాక్ ఖరాబ్.. సాంగో వచ్చేస్తోందచ్ అంటూ నానా హంగామా చేశారు ఇస్మార్ట్ శంకర్ అండ్ టీమ్. మరి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి, ఖచ్చితంగా అందరూ ఇదో పోకిరి సినిమాలో మాస్ సాంగ్ తరహాలోఉంటుందనే ఊహించుకుంటారు. ఈరోజు రిలీజైన ఈ సాంగ్ ఇంతకీ ఎలా ఉందో తెలియాలంటే ఓసారి లిరికల్ వీడియో వినాల్సిందే.

నిజం చెప్పాలంటే.. ఈ పాట కోసం హీరోయిన్ల తాలూకు అందాల మీద పెట్టిన ఫోకస్ ఎందుకో ట్యూన్ క్వాలిటీలో పెట్టలేదని అర్ధమవుతోంది. 'సృజనా తిన్నావేరా' అనే డైలాగ్ తాలూకు డిజె మిక్స్ ఒకటి యుట్యూబ్ లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. దాని ప్రభావంతో మణిశర్మ సారు గిట్లాంటి సాంగ్ కంపోజ్ చేసిండ్రని ఎవ్వరికైనా అనిపంచకమానదు. ధిమ్మాక్ ఖరాబ్ అనే వర్డ్ కనీసం రిథమిక్ గా కూడా లేదంటో చూస్కోండి. దానికితోడు మధ్యలో ఫోక్ బీటుతో జిలేలమ్మా జిట్టా అంటూ మణిశర్మ రొటీన్ డప్పులు కొడుతుంటే, మాస్ సాంగ్ ఇట్టా ఉంటే ఎట్టా సారూ అని మ్యూజిక్ లవ్వర్స్ అనుకోవాల్సిందే.

అయితే ఈ సాంగ్ డ్యాన్స్ విషయంలో మన 'ఇస్మార్ట్ శంకర్' రామ్ కుమ్మేసుంటాడని అర్ధంచేసుకోవచ్చు. ఒక ప్రక్కన హీరోయిన్ల నాటు గ్లామర్, మరో ప్రక్కన రామ్ అదిరిపోయే స్టెప్పులు వేస్తే, ధియేటర్లలో వీలలు పడతాయిలే. కాకపోతే రిపీట్ వాల్యూ ఉండే సాంగ్ మాత్రం కాదిది. మణి గారూ, ఎక్కడో మ్యూజిక్ పలచబడుతోంది సారూ!!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English