ఎవరయినా ఈ హీరోయిన్లని దాటి వెళ్లాల్సిందే

ఎవరయినా ఈ హీరోయిన్లని దాటి వెళ్లాల్సిందే

హీరోయిన్ల కొరత బాగా పీడిస్తోన్న దశలో ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లు దానిని ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంటున్నారు. ఏ పెద్ద సినిమా అనౌన్స్‌ అయినా కానీ ముందుగా వారిద్దరినే కన్సిడర్‌ చేస్తున్నారు. వాళ్లు డేట్స్‌ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. వారికి కుదరదని తేలిన తర్వాతే వేరే హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. వాళ్లిద్దరే పూజా హెగ్డే, రష్మిక. యువతలో వీరికి క్రేజ్‌ వుండడంతో, మిగతా హీరోయిన్లలో స్టార్‌ హీరోల పక్కన మెరిసే కరిజ్మా లేకపోవడంతో వీరిద్దరి పంట పండుతోంది.

పూజాకి బాలీవుడ్‌లోను ఆఫర్లుంటే, రష్మికకి కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లోను డిమాండ్‌ వుంది. స్టార్‌ హీరోల పక్కన నటించడానికి కూడా పారితోషికం పరంగా కాంప్రమైజ్‌ అవ్వాల్సిన పని లేకుండా భారీగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి మూడు, నాలుగేళ్లకీ ఒక సెట్‌ ఆఫ్‌ టాప్‌ హీరోయిన్స్‌ పుట్టుకొస్తుంటారు కనుక నెక్స్‌ట్‌ సెట్‌ దిగే వరకు ఏ ప్రాజెక్ట్‌ అయినా వీరిని దాటి వెళ్లాల్సిందే. బల్క్‌ డేట్స్‌ కావాలని అడిగితే ఏ సినిమాకీ ఇచ్చే పొజిషన్‌ లేకపోవడంతో వీరు డేట్లు ఇచ్చిన ప్రకారం సినిమా షూటింగ్‌లు ప్లాన్‌ చేసుకోవాల్సి వస్తోంది. జిగేలు రాణి పాటలో మెరిసిన పూజ ఇకపై అలా ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడానికి కూడా సమయం లేదని తేల్చి చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English