మున్నా త‌ర్వాత‌.. బృందావ‌నం ముందు

మున్నా త‌ర్వాత‌.. బృందావ‌నం ముందు

ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ఏళ్ల‌కు ఏళ్లు ప‌ని చేయ‌కుండానే.. 26 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే ఒక పెద్ద బేన‌ర్లో స్టార్ హీరోతో సినిమా తీసే అవ‌కాశం రావ‌డం అరుదైన విష‌యం. వంశీ పైడిప‌ల్లికి మున్నా సినిమాతో ఇలాంటి అదృష్ట‌మే ద‌క్కింది. కానీ ఈ అవ‌కాశాన్ని అత‌ను స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. అరంగేట్రంలో పెద్ద ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. అయినా అత‌డికి ఎన్టీఆర్ లాంటి మ‌రో స్టార్‌తో రాజు బేన‌ర్లోనే బృందావ‌నం లాంటి మ‌రో పెద్ద సినిమా తీసే అవ‌కాశం ల‌భించింది. ఐతే మున్నా-బృందావ‌నం మ‌ధ్య‌లో తాను వేద‌న అనుభ‌వించాన‌ని.. అది త‌న‌కు జీవిత పాఠాలు నేర్పిన కాల‌మ‌ని..  ఇప్పుడు చూసుకుంటే త‌న జీవితంలో అత్యంత విలువైన రోజులు అవే అనిపిస్తోంద‌ని అంటున్నాడు వంశీ. తాజాగా ఒక టీవీ కార్య‌క్ర‌మంలో ఆ రోజుల గురించి అత‌ను గుర్తు చేసుకున్నాడు.


‘‘మున్నా తర్వాత నాకు చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. నేను ఏ సినిమానైనా పెద్దగానే చూస్తా. చిన్నప్పటి నుంచి అది అలవాటైంది. అందుకే మళ్లీ సినిమా చేస్తే పెద్ద హీరోతోనే చేయాలనుకున్నా. ‘మున్నా’ తర్వాత ఏడాది పాటు నాకు సంపాదన లేదు. మా నాన్నగారు నన్ను పోషించారు. నా పెళ్లి కూడా ఆయనే చేశారు. ‘మున్నా’ టీజర్‌ చూసి ఎన్టీఆర్‌ నాకు ఫోన్‌ చేశారు. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం పెరిగింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ‘వంశీ నువ్వు దర్శకుడిగా ఫెయిల్‌ కాలేదు. కథలో ఎక్కడో లోపం ఉంది. మంచి కథ సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అన్నారు.  ఆ తర్వాత ఒక కాఫీ షాప్‌లో నేనూ, చరణ్‌ అనుకోకుండా కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారు. ఆ ఏడాది ఇవన్నీ నాకు ఒక మోటివేషన్‌లా పనిచేశాయి. ఆ తర్వాత ‘బృందావనం’ కథ రాసుకున్నా. మళ్లీ రాజుగారిని కలిసి ఈ ఆలోచన చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఎన్టీఆర్‌కు కథ చెప్పా. ఫస్ట్‌లైన్‌ చెప్పగానే లేచి హగ్‌ చేసుకుని మనం ఈ సినిమా చేస్తున్నామ‌న్నాడు’’ అని వంశీ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English