ఎన్టీఆరూ.. ఏం ప్లానింగ‌య్యా!

ఎన్టీఆరూ.. ఏం ప్లానింగ‌య్యా!

ఒక భారీ హిట్టు కొట్టాక, ఒక్క‌సారిగా ఇమేజ్, ఫాలోయింగ్ పెరిగాక‌ ఆ ఊపును కొన‌సాగించే సినిమా ప‌డ‌టం చాలా కీల‌కం. అది అంద‌రు హీరోల‌కూ జ‌ర‌గ‌దు. *మ‌గ‌ధీర‌* త‌ర్వాత *ఆరెంజ్* సినిమా చేసి రామ్ చ‌ర‌ణ్ ఎంత ఇబ్బంది ప‌డ్డాడో తెలిసిందే. ఇక ప్ర‌భాస్ *బాహుబ‌లి* త‌ర్వాత *సాహో* లాంటి భారీ చిత్రం ప్లాన్ చేసుకున్నాడు. దీని మేకింగ్ వీడియోలు చూస్తుంటే పెరిగిన ప్ర‌భాస్ స్థాయికి త‌గ్గ‌ట్లే క‌నిపిస్తోంది. సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటే ప్ర‌భాస్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లిపోవ‌డం ఖాయం. ఐతే ప్ర‌భాస్.. సుజీత్ లాంటి కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా ప్లాన్ చేసుకోవ‌డం కొంత ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఐతే జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళితో *ఆర్ఆర్ఆర్* చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వ‌రుస హిట్ల‌తో ఎన్టీఆర్ ఫాలోయింగ్, మార్కెట్ ఎంతో పెరిగాయి.


ఇప్పుడు రాజ‌మౌళి సినిమా క‌నుక హిట్ట‌యితే అత‌ను ఒకేసారి చాలా మెట్లు ఎక్కేస్తాడు. అలాంటి స‌మ‌యంలో త‌ర్వాత ఎలాంటి సినిమా సెట్ చేసుకుంటాడ‌న్న‌ది కీల‌కం. *ఆర్ఆర్ఆర్*లో న‌టిస్తున్న మ‌రో హీరో రామ్ చ‌ర‌ణ్ సంగ‌తేమో కానీ.. ఎన్టీఆర్ మాత్రం భ‌లే ప్రాజెక్టు ఫిక్స్ చేసుకున్నట్లు క‌నిపిస్తున్నాడు. *కేజీఎఫ్‌* ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో అత‌ను సినిమా చేస్తాడ‌ట‌. *కేజీఎఫ్‌*లో య‌శ్ లాంటి మామూలు హీరోనే ఓ రేంజిలో చూపించాడు. ఇక తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను అత‌నెలా ప్రెజెంట్ చేస్తాడో అంచ‌నా వేయొచ్చు. హీరో ఎలివేష‌న్ *కేజీఎఫ్‌* త‌ర‌హాలోనే ఉంటే మాత్రం సినిమా ఎక్క‌డికో వెళ్లిపోతుంది. అస‌లే వ‌రుస‌గా ఐదు స‌క్సెస్ ఫుల్ సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత రాజ‌మౌళి చిత్రం చేస్తున్న తార‌క్.. ప్ర‌శాంత్‌తో ప్రాజెక్టు సెట్ అయి.. అది కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటే మాత్రం ఇక అత‌డిని ఆప‌డం క‌ష్ట‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English