ఫోర్స్ చెయ్యకులే బాలయ్యా!

ఫోర్స్ చెయ్యకులే బాలయ్యా!

నందమూరి బాలకృష్ణ తన నట వారసుడిగా కొడుకు మోక్షజ్ఞను రంగంలోకి దింపుతున్నాడని ఎప్పటినుండో వస్తున్న న్యూసే. అయితే ఇప్పుడు మాత్రం అసలు మోక్షజ్ఞకు సినిమాలంటే ఇష్టం లేదని, అందుకే అతని తన ఫిజిక్ మీద ఏమాత్రం ఫోకస్ చేయకుండా సరదాగా ఫిలిం నగర్ కాఫీ షాపుల్లో టైమ్ పాస్ చేస్తున్నాడని ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బాలయ్య హార్డ్ కోర్ అభిమానులు మాత్రం ఒక కామెంట్ చేస్తున్నారు.

నిజంగానే మోక్షజ్ఞకు అస్సలు సినిమాలంటే ఇష్టం లేకపోతే మాత్రం సినిమాల్లోకి ఫోర్స్ చేయొద్దంటూ ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మన తెలుగులో ఆల్రెడీ తనకు ఇష్టంలేకపోయినా కూడా అఖిల్ ను క్రికెట్ మాన్పించి సినిమాల్లోకి తెచ్చేశాడు నాగార్జున. కాని ఇంకా ఆ కుర్రాడు మాత్రం నిలదొక్కుకోలేదు. మరోవైపు పెద్ద పెద్ద స్టార్స్ పిల్లలెవ్వరూ బాలీవుడ్లో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పిల్లలకు ఇష్టమైనదే చేయనివ్వాలి కాని, బలవంతంగా సినిమాల్లోకి తెస్తే మాత్రం వాళ్లు పెద్ద హీరోలవ్వడం కష్టమే అని తెలుస్తోంది. అందుకే బాలయ్య కూడా మోక్షజ్ఞను ఫోర్స్ చేయకపోవడమే బెటర్ అనేది చాలామంది అభిప్రాయం.

ఇకపోతే ఆల్రెడీ తన కొడుకును హీరోగా చూడాలనే కల నెరవేడటానికి, ఇప్పుడు బాలయ్య తన కూతుళ్ళకు అప్పగించాడట. వాళ్ళు త్వరలోనే మోక్షజ్ఞను ఒప్పించి, తమ్ముడు హీరో అవ్వడానికి కావల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారట. చూద్దాం ఏమవుతుందో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English