మహేష్‌ డబుల్ యాక్షన్ చూశారా

మహేష్‌ డబుల్ యాక్షన్ చూశారా

జర్మనీలో తన టూర్ ముగించుకుని ఇప్పుడు లండన్ చేరుకున్నాడు సూపర్ స్టార్ మహేష్‌. అక్కడ మనోడు ఇండియా ఆడే ఓ మూడు మ్యాచులను తిలకించి అప్పుడు ఇండియా వస్తాడట. ఇకపోతే వచ్చాక మనోడు అనిల్ రావిపూడి డైరక్షన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగులో పాల్గొంటాడు. ఇంతకీ ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తున్న ఈ డబుల్ యాక్షన్ టాక్ ఏంటో చూద్దాం పదండి.

ఈ సినిమాలో మహేష్‌ బాబు ఎటువంటి డబుల్ యాక్షన్ చేయట్లేదు కాని, ఈ సినిమా కోసం రియల్ లైఫులో డబుల్ యాక్షన్ చేస్తున్నాడట. ప్రస్తుతం లండన్లో ఉన్న మహేష్‌, ఫోన్లేనే సగం పనులు చక్కపెట్టేస్తున్నాడట. ఆల్రెడీ మహేష్‌ లేకుండానే ముహూర్తం కూడా కొట్టేశారు. అయితే అది మనోడికి సెంటిమెంట్ అనుకుందాం. ఇకపోతే ఫోన్లో సంప్రదింపులు జరిపి, రత్నవేలు వంటి సినిమాటోగ్రాఫర్ ను అలాగే కీలకమైన పాత్రకు రాజేంద్రప్రసాద్ ను, హీరోయిన్ గా రష్మిక మందన్నాను ఓకే చేసేశారు. రత్నవేలు సినిమా చేసినా చేయకపోయినా, మిగిలినోళ్ళు అయితే పక్కాగా కన్ఫామ్ అయిపోయారు.

అయితే ఏ సినిమాలో అయినా హీరో లేకుండానే ఇవన్నీ చేస్తారు కదా, మరి లండన్లో ఉన్న మహేష్‌ ఎందుకు అన్నింటిలో తలదూర్చడం అనుకుంటున్నారేమో, ఈ సినిమాకు మహేష్‌ నిర్మాత కూడాను. అందుకే తాను హైదరాబాదు వచ్చేలోపు ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించి తాను ఏం చేయాలో అవన్నీ కానిచ్చేస్తున్నాడు. ఆల్రెడీ సినిమా కోసం లుక్ కూడా లండన్ లో ఉండే ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English