కండలు సరే.. గ్రేస్ పోతోంది సమంత

కండలు సరే.. గ్రేస్ పోతోంది సమంత

కుదిరితే దేన్నా ఠారెత్తించే ఫోటో షూట్, లేదంటే తాను జిమ్ చేస్తున్న వీడియోలో ఫోటోలో షేర్ చేయడం.. సమంతకు అలవాటే. అందుకే ఆమె ఇనస్టాగ్రామ్ ఫీడ్ అంతా చాలా వేడివేడిగా ఉంటుంది. పెళ్ళయిన హీరోయిన్స్ మన దక్షిణాదిలో ఈ రేంజులో రెచ్చిపోవడం చాలా అరుదే. కాని సమంత మాత్రం తన గ్లామర్ డోస్ తో కుర్రాళ్ళను ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం తాను హెవీ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్న ఫోటో ఒకటి బ్యాక్ నుండి తీయించి.. అది షేర్ చేసింది సమంత. ఆమె వయస్సులో, అదే విధంగా ఆమె రేంజులో ఉన్న ఇతర తెలుగు హీరోయిన్లెవ్వరూ లేనంత హాటుగా ఉందిలే ఈ ఫోజులో. అయితే ఒక్క విషయం మాత్రం సమంత గమనించాల్సిందే అంటున్నారు ఆమె అభిమానులు. ఈ టైపులో హెవీ వెయిట్ ట్రైనింగ్ అంటూ సమంత పవర్ఫుల్ ఉమెన్ గా తయారవుతున్నా కూడా.. మరీ 100 కేజీల బరువుతో జిమ్మింగ్ చేయడం వలన ఆమె ఫేస్ లో గ్రేస్ పోతోందని వారు వాపోతున్నారు. ఆమె చెంపలు లోపలకు వెళ్ళిపోయి, చిన్నపిల్లలాటి లేత లుక్ ఆమె ముఖంలో కనిపించట్లేదనేది వారి వాదన.

అదీ నిజమే. జిమ్ ఎక్కువ చేయడం వలన ఫేస్ లో ఉన్న గ్లో కాస్త తగ్గిపోతూ ఉంటుంది. గతంలో సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తుంటే ఫేస్ లో లుక్ పోతోందని మహేష్‌ బాబు ఓపెన్ గానే చెప్పాడు. మరి సమంత ఎందుకో వెయిట్సే వెయిట్స్ అంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English