ధనుష్ హీరో.. ఆయన దర్శకత్వం

ధనుష్ హీరో.. ఆయన దర్శకత్వం

తమిళ కథానాయకుడు ధనుష్‌ను ఒకప్పుడు వేరే భాషల వాళ్లు చూసి ఇతనేం హీరో అన్నారు. అతడి అవతారం చూసి షాకయ్యారు. కానీ లుక్స్ పరంగా ఎంత సాదాసీదాగా కనిపించినా.. నటనలో అద్భుత నైపుణ్యం చూపించి తన ప్రత్యేకత చాటుకున్న నటుడు ధనుష్. తమిళ ప్రేక్షకుల్నే కాక మిగతా భాషల వాళ్లనూ ఇలాగే మెప్పించాడు. తనను చూసి తమాషా చేసిన ఉత్తరాది వాళ్లను కూడా ‘రాన్ జానా’తో మెస్మరైజ్ చేశాడు. ‘తను వెడ్స్ మను’ సిరీస్‌తో పేరు సంపాదించిన ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రానికి ధనుష్ నటనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందీలో ధనుష్ ‘షమితాబ్’ అనే ఇంకో సినిమా కూడా చేశాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.

ఐతే చాలా గ్యాప్ తర్వాత ధనుష్ మళ్లీ హిందీలో నటించబోతున్నాడట. తనకు ‘రాన్ జానా’ లాంటి మరపురాని సినిమా అందించిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలోనే ధనుష్ మళ్లీ నటించబోతున్నాడు. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న ధనుష్‌ను హిందీలో మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడిగితే.. ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా కమిటయ్యానని.. అది త్వరలోనే మొదలవుతుందని చెప్పాడు. వరుసగా హిట్లు ఇచ్చిన ఆనంద్ ‘జీరో’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇలాంటి తరుణంలో మళ్లీ దక్షిణాది హీరోను నమ్ముకోవడం విశేషమే. మరోవైపు ధనుష్.. గత ఏడాది ‘వడ చెన్నై’తో ధనుష్ భారీ విజయాన్నందుకున్నాడు. ‘మారి-2’ కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం తన స్నేహితుడు వెట్రిమారన్ దర్శకత్వంలోనే ‘అసురన్’ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English