ధనుష్ చేస్తాడట.. అదిరిపోదూ!

ధనుష్ చేస్తాడట.. అదిరిపోదూ!

అంధాదున్.. ఈ మధ్య కాలంలో హిందీలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటి. ఇంతకుముందు 'బద్లాపూర్' లాంటి ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ తీసిన శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన చిత్రమిది. చిన్న సినిమాలతో పెద్ద స్థాయికి చేరుకున్న ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించాడు. రాధికా ఆప్టే, టబు కీలక పాత్రల్లో నటించారు. సంగీతం మీద ఏకాగ్రత కుదరడం కోసం అంధుడిగా నటించిన ఓ కుర్రాడు.. అనుకోకుండా ఓ హత్య కేసు చూసి చిక్కుల్లో పడతాడు.

అక్కడి నుంచి అతడి జీవితం ఎలాంటి మలుపులు తెరకెక్కిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ వసూళ్లు సాధించింది. ఈ మధ్యే చైనీస్‌లోకి అనువాదం చేసి రిలీజ్ చేయగా.. వందల కోట్ల వసూళ్లు రాబట్టింది.

'అంధాదున్'ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తమిళంలో సిద్దార్థ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలొచ్చాయి. సిద్దార్థ్ కూడా ఆసక్తి ప్రదర్శించాడు. ఈ రీమేక్‌లో నటించడంపై అభిమానుల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కథ మారిందట. సిద్ధు కాకుండా ధనుష్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోందట రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సంస్థ. ధనుష్ కూడా ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట. ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ సాగే ఈ సినిమాలో హీరో పాత్ర భలేగా ఉంటుంది. అంధుడిగా కనిపిస్తూ అనేక హావభావాలు ప్రదర్శిస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సాగే ఈ పాత్ర ధనుష్‌ లాంటి పెర్ఫామర్‌కు భలేగా సూటవుతుందనడంలో సందేహం లేదు.

ఒరిజినల్‌లో ఆయుష్మాన్‌ను మించి పెర్ఫామెన్స్ ఇస్తాడని ఆశించవచ్చు. కాబట్టి అతను చేస్తే ఈ సినిమా సూపర్ హిట్టయ్యేందుకు ఛాన్స్ ఉంది. మరి నిజంగానే ధనుష్ 'అంధాదున్' రీమేక్‌లో నటిస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English