మహేష్‌కి ఎక్స్‌ట్రా హెడ్డేక్స్‌ ఏమీ లేవు

మహేష్‌కి ఎక్స్‌ట్రా హెడ్డేక్స్‌ ఏమీ లేవు

సరిలేరు నీకెవ్వరులో మహేష్‌ ఆర్మీ మేజర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడనగానే బాడీ పెంచుతాడని, ప్రత్యేక ట్రెయినర్‌ని పెట్టుకుని కసరత్తులు చేస్తాడని చెప్పుకున్నారు. కానీ మహేష్‌ ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాల్సిన పని లేదని, కొత్త గెటప్స్‌ కూడా ట్రై చేయనక్కరలేదని దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పష్టం చేసేసాడు. కథలో మహేష్‌ చేసే జాబ్‌ మేజర్‌ తప్ప సినిమాలో దాని పాత్ర తక్కువేనట.

ప్రధానంగా విలేజ్‌లో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌ వుంటుందట. కనుక దాని కోసం మహేష్‌ బాడీ పెంచడం లాంటివి అవసరం ఏమీ వుండదని అనిల్‌ రావిపూడి చెప్పడంతో మహేష్‌ షూటింగ్‌కి ముందు ఫ్యామిలీతో కలిసి విదేశాలు టూర్‌ చేస్తూ రిలాక్స్‌ అవుతున్నాడు. పిల్లలకి స్కూల్స్‌ సెలవు కనుక వారికి వివిధ దేశాలు చూపిస్తున్నాడు. జర్మనీలో హాలిడే పూర్తి చేసుకున్న మహేష్‌ ఫ్యామిలీ ఇప్పుడు ఇటలీకి పయనమయింది. ఈ టూర్‌ ముగిసిన తర్వాత మహేష్‌ సరాసరి 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాడు.

 ఈ చిత్రాన్ని అయిదు నెలలలో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తానని అనిల్‌ రావిపూడి తేల్చేయడంతో మహేష్‌ కంప్లీట్‌గా రిలాక్స్‌ అయిపోయాడు. సాధారణంగా తనతో చేసే దర్శకులు కనీసం ఏడాది టైమ్‌ అడుగుతుంటారు. కానీ రావిపూడి మాత్రం కేవలం ఆరే నెలల్లో పూర్తి చేసి విడుదల చేసేస్తానని మాట ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English