ఎన్ని వేషాలు వేసినా జనం దేఖట్లేదు!

ఎన్ని వేషాలు వేసినా జనం దేఖట్లేదు!

ట్రెయిలర్‌లో శృంగార దృశ్యాలు రంగరించి, అంగ స్తంభనం గురించి ఆడవాళ్లతో మాట్లాడించినంత మాత్రాన అన్ని చిత్రాలకీ క్రేజ్‌ వచ్చేయదు. ఆర్‌ఎక్స్‌ 100, ఫలక్‌నుమా దాస్‌ లాంటి ఏవో కొన్ని చిత్రాలు మాత్రం అయితే శృంగార దృశ్యాలతోనో లేదా బూతు మాటలతోనో జనం దృష్టిని ఆకర్షిస్తుంటాయి కానీ, అదే రీతిన వచ్చిన అన్ని సినిమాలకీ అలాంటి క్రేజ్‌ వస్తుందనే గ్యారెంటీ లేదు.

ఆర్‌ఎక్స్‌ 100 ఎందుకు ఆడింది, ఆ చిత్రం విజయంలో తన పాత్ర ఎంత అనేది చూసుకోకుండా 'హిప్పీ'కి కూడా జనం ఎగబడిపోతారని అనుకున్న కార్తికేయ మొన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రెచ్చిపోయి మాట్లాడేసాడు. అయితే ఎంత ట్రై చేసినా ఈ చిత్రానికి ఆర్‌ఎక్స్‌ 100లా క్రేజ్‌ రాలేదు. టికెట్‌ సేల్స్‌ చూస్తుంటే నిర్మాతలకి, బయ్యర్లకి భయం పుట్టకపోదు. అందుకే దీనికి ఎలాగయినా క్రేజ్‌ తేవాలని ఓ చీప్‌ ట్రిక్‌ ప్లే చేసారు.

వీడియో ఇంటర్వ్యూకి వెళ్లి కార్తికేయ చొక్కా విప్పితే, జెడి చక్రవర్తి ప్యాంట్‌ విప్పేసి 'కామెడీ' చేసారు. ఈ వీడియో బైట్‌తో ఈ చిత్రంపై క్రేజ్‌ వస్తుందని వారు భావిస్తే జనాలకి వెగటు పుట్టి ఇలాంటి వెకిలి వేషాలు బయటే వేస్తున్నారంటే ఇక సినిమాలో ఎన్ని ఛండాలాలు చేసారోనని తిట్టుకుంటున్నారు. ఫైనల్‌గా కంటెంట్‌ సేల్‌ అవ్వాల్సిందే కానీ ఇలాంటి చిల్లర వేషాలకి చిల్లర రాలదని ఎంత త్వరగా రియలైజ్‌ అయితే అంత బెటరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English