కాజల్‌ మరీ అంతలా రెచ్చిపోయిందా?

కాజల్‌ మరీ అంతలా రెచ్చిపోయిందా?

కాజల్‌ అగర్వాల్‌ పన్నెండేళ్లుగా చిత్ర పరిశ్రమలో వుంది. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు, గ్లామర్‌ ప్రధాన పాత్రలతో తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది. అయితే ఈ పుష్కర కాలంలో ఆమె ఎప్పుడూ బోల్డ్‌ క్యారెక్టర్స్‌ చేయలేదు. ఆ మాటకి వస్తే దక్షిణాది హీరోయిన్లు బోల్డ్‌గా కనిపించే పాత్రలు చేయడం అరుదు. బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించినా కానీ కాజల్‌ అక్కడి ట్రెండ్‌కి తగ్గట్టు కనిపించలేదు.

కానీ 'క్వీన్‌' రీమేక్‌లో మాత్రం కాజల్‌ హద్దులు దాటిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కంగన రనౌత్‌కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిన క్వీన్‌ని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్‌, కన్నడలో పారుల్‌ యాదవ్‌తో రీమేక్‌ చేస్తున్నారు. ఈ మూడు సినిమాల టీజర్లలో కూడా కాజల్‌ టీజరే షాకిచ్చింది. అందులో కాజల్‌ బ్రెస్ట్స్‌ని తోటి నటి చేత్తో పట్టుకుని నొక్కే దృశ్యం సోషల్‌ మీడియా మీమ్‌ మేకర్స్‌ పంట పండించింది. టీజర్‌లో చూపించిన ఆ షాట్‌లోనే కాదు... ఈ చిత్రంలో కాజల్‌ బాగా రెచ్చిపోయిందట. దీంతో ఈ చిత్రానికి సెన్సార్‌ క్లియరెన్స్‌ వస్తుందా రాదా అనే అనుమానం కూడా నెలకొందట.

పాత్రకి అవసరం అంటూ కాజల్‌ కన్విన్స్‌ అయిపోయి అలా చేసేసింది కానీ సెన్సార్‌ ఆ సీన్లు అన్నీ థియేటర్‌లో చూడనిస్తుందా లేదా అనేది మాత్రం డౌటేనట. ఒకవేళ ఆ దృశ్యాలు ఎడిట్‌ అయిపోతే డిలీటెడ్‌ సీన్స్‌ పేరిట వాటిని యూట్యూబ్‌లో విడుదల చేసే ఆలోచన వుందట. మరి కాజల్‌ కష్టం సెన్సార్‌ కత్తెర పాలయిపోకూడదు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English