డైరెక్టర్ శంకర్‌పై సంచలన వ్యాఖ్యలు

డైరెక్టర్ శంకర్‌పై సంచలన వ్యాఖ్యలు

తమిళ సినీ చరిత్రలో అతి పెద్ద కమెడియన్లలో వడివేలు ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన ప్రస్థానం సాగుతోంది. ఇందులో దాదాపు 20 ఏళ్లు ఆయన తిరుగులేని స్థాయిలో ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు. సినిమాలు తగ్గిపోయాయి. వివాదాలు ఎక్కువయ్యాయి. తరచుగా ఎవరినో ఒకరిని విమర్శించి వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు ఆయన.

రాజకీయ నేతల మీద కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి ఒక టైంలో అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. ఆయనకు నోటి దురుసు కొంచెం ఎక్కువే అనడంలో మరో మాట లేదు. తాజాగా ఆయన అగ్ర దర్శకుడు శంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడిగా పేరున్న శంకర్‌ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశాడు. అతను కేవలం గ్రాఫిక్స్‌ను నమ్ముకుని సినిమాలు తీసే రకం అన్నాడు.

శంకర్ నిర్మాణంలో అతడి శిష్యుడు తీసిన '23వ పులకేసి' సినిమాలో వడివేలే హీరో. ఆ చిత్రం సూపర్ హిట్టయింది. ఐతే దీనికి సీక్వెల్ తీయడానికి శంకర్-శింబుదేవన్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఐతే అడ్వాన్స్ తీసుకుని షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాక వడివేలు హ్యాండిచ్చాడు. దీనిపై చాన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో శంకర్-శింబుదేవన్‌లను టార్గెట్ చేశాడు వడివేలు.

''అసలు శింబుదేవన్‌కు దర్శకత్వమే రాదు. '23వ పులికేసి'లో సినిమా చాలా వరకు నా చేతుల మీదే నడిచింది. అందులో కొన్ని పాత్రల్ని నేనే తీర్చిదిద్దా. హాస్య సన్నివేశాలు కూడా రాశా. శింబుదేవన్ '24వ పులికేసి' లైన్ మాత్రమే చెప్పాడు. నేను పూర్తి స్థాయిలో చర్చించి.. అందులో త్రిపాత్రాభినయం వచ్చేలా కథ మార్చా. అంతేకాకుండా హాస్య సన్నివేశాలు కూడా చెప్పా. అప్పుడు సంపూర్ణ చిత్రంగా మారింది. దర్శకుడు శంకర్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రాఫిక్‌ సన్నివేశాలతోనే దర్శకుడిగా నెట్టుకొస్తున్నారు. ఆయన కేవలం ఒక గ్రాఫిక్స్‌ డైరెక్టర్‌'' అని వడివేలు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English