పాప ‘నేల టూ బాల్కనీ’ కుమ్మేస్తుందట

పాప ‘నేల టూ బాల్కనీ’ కుమ్మేస్తుందట

అల్లు అర్జున్‌ సరసన నటించిన ఇద్దరమ్మాయిల్లో అమలా పాల్‌ గురించి అందరికీ తెలుసు. ఆమెని నాయక్‌లో చాలా మంది చూసి ఉన్నారు. అయితే మరో అమ్మాయి క్యాథరీన్‌ నటించిన తొలి సినిమా చమ్మక్‌ చల్లో ఎవరి కంట్లో పడకుండా పోయింది. దాంతో ఆమె తెరంగేట్రం వృధా అయింది. ఆ సినిమా ఎవరి కంటా పడకపోయినా క్యాథరీన్‌ మాత్రం పెద్దవాళ్ల కంట్లో త్వరగానే పడిరది.

ఇద్దరమ్మాయిలతో చిత్రంలో ఆమె చేత మాసు, క్లాసు మెప్పించే పాత్ర చేయించారు. ఈ చిత్రం పాటల్లో సూపర్‌హిట్‌ అయిన ‘టాప్‌ లేసిపోద్ది’ సాంగ్‌ కూడా క్యాథరీన్‌పైనే చిత్రీకరించారు. ఈమె హీరోయిన్‌గా చాలా పెద్ద రేంజ్‌కి వెళుతుందని బన్నీ జోస్యం చెబుతున్నాడు. అప్పుడే ఆమె పేరుని చరణ్‌కి సిఫార్సు చేసి అతని సినిమాలో అవకాశం కూడా ఇప్పించాడు. ఇలియానా, అనుష్క, సమంత మాదిరిగా క్యాధరీన్‌ కూడా ఒక సెన్సేషన్‌ అయి కొన్నాళ్ల పాటయినా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తుందని అంటున్నారు. మరి ఆమె ఎంతగా ఊపేస్తుందనేది ఇద్దరమ్మాయిలతో చూసి తేల్చుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు