బాక్సాఫీస్ షేక్ అవబోతున్నట్లే..

 బాక్సాఫీస్ షేక్ అవబోతున్నట్లే..

కొందరు సూపర్ స్టార్లుంటారు. వాళ్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ షేకైపోవాల్సిందే. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ అలాంటి హీరోనే. ఆయన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా కనీసం వంద కోట్ల గ్రాస్ గ్యారెంటీ. గత ఏడాది రంజాన్ పండక్కి వచ్చిన ‘రేస్-3’కి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా రూ.150 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఈసారి ఈద్‌కు షెడ్యూల్ అయిన సల్మాన్ సినిమా ‘భారత్’ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ట్రైలర్ చూస్తే ఈ సినిమా కచ్చితంగా హిట్టయ్యేలా కనిపించింది.

ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వస్తోంది. ముందు రోజు ముంబయిలో ప్రెస్ వాళ్లకు స్పెషల్ ప్రివ్యూ వేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తరణ్ ఆదర్శ్ ఆల్రెడీ 4 స్టార్ రేటింగ్‌తో రివ్యూ రాసి ‘భారత్’ స్మాష్ హిట్ కాబోతోందని తీర్పిచ్చేశాడు. సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ కావడం మినహాయిస్తే ఏ మైనస్‌లూ లేవని.. బాక్సాఫీస్ దగ్గర ‘సల్మేనియా’ చూడబోతున్నారని అన్నాడు. మిగతా రివ్యూయర్లు కూడా సినిమా గురించి పాజిటివ్‌గానే రాశారు. ఇక ఉదయం షోల మధ్య నుంచి ప్రేక్షకులు కూడా పాజిటివ్ ట్వీట్లు వేస్తున్నారు. అర్లీ షోస్ అన్నిటికీ పాజిటివ్ టాకే వచ్చింది.

మొత్తానికి ‘భారత్’ సినిమా హిట్టవడం గ్యారెంటీగా అనిపిస్తోంది. రంజాన్ పండగ అంటే ప్రతిసారీ సల్మాన్ సినిమా గ్యారెంటీ. మామూలు టైంలో కంటే అతడి సినిమాలకు ఈ టైంలో ఎక్కువ వసూళ్లు వస్తాయి. చాన్నాళ్లుగా బాలీవుడ్లో సరైన మాస్ మూవీ పడని నేపథ్యంలో సల్మాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రం సునాయాసంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకోవడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండిట్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English