సాహో సెన్సేషన్ రెడీనా?

సాహో సెన్సేషన్ రెడీనా?

ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ దృష్టంతా ‘సాహో’ మీదే ఉంది. ‘బాహుబలి’తో ఆకాశమంత ఇమేజ్ సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ఇది. సౌత్ వాళ్లే కాదు.. నార్త్ ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే అనడంలో సందేహం లేదు. రిలీజ్ డేట్ విషయంలో సందేహాలకు తెరదించుతూ ఆగస్టు 15నే సినిమా పక్కాగా వస్తుందని చిత్ర బృందం ఇటీవలే స్పష్టత ఇచ్చింది. ఇప్పదాకా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలు, పోస్టర్లు సినిమాపై ఎంతో ఆసక్తి పెంచాయి. ఇప్పుడు ప్రమోషన్ల జోరు మరింత పెంచాల్సిన సమయం వచ్చింది. విడుదలకు ఇక మిగిలింది అటు ఇటుగా 70 రోజులే. కాబట్టి టీజర్ ట్రీట్ ఇవ్వడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇంకో నాలుగైదు రోజుల్లోనే ‘సాహో’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. నిజానికి రంజాన్ కానుకగా రిలీజవుతున్న సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ థియేటర్లలో ‘సాహో’ టీజర్ ప్రదర్శించాలని అనుకున్నారు. తొలి రోజే సినిమాతో పాటు టీజర్‌ను అటాచ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఐతే టీజర్ పని అలాగే కొనసాగించి.. సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారు. రేపో ఎల్లుండో దీని గురించి అప్ డేట్ రావొచ్చని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే టీజర్ గురించి పెద్ద డిస్కషనే నడుస్తోంది. టీజర్ సెన్సేషనల్‌గా, యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయట. ఐతే కాస్త అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో టీజర్ రావడం అయితే పక్కా అంటున్నారు. ఈ టీజర్ వస్తే యూట్యూబ్ వ్యూస్, లైక్స్ రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English