సూర్యను మనమ్మాయే కాపాడాలి

సూర్యను మనమ్మాయే కాపాడాలి

అంతంతమాత్రంగా సాగుతున్న ‘సూర్య’ కెరీర్‌ను ‘ఎన్జీకే’ కాస్త పైకి లేపుతుందేమో అనుకుంటే.. దాన్ని మరింతగా కిందికి తొక్కేసింది. సూర్య ఇంతకుముందు ఫ్లాపులు మాత్రమే ఇచ్చాడు. కానీ ‘ఎన్జీకే’ డిజాస్టర్ అయింది. అతడికి చాలా చెడ్డ పేరు తెచ్చింది. సూర్య జడ్జిమెంట్ మీద అనేక సందేహాలు రేకెత్తించింది. కెరీర్ మొత్తంలోనే సూర్య చేసిన అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. ‘ఎన్జీకే’ దెబ్బకు తెలుగులో సూర్య మార్కెట్ దాదాపుగా జీరో అయిపోయింది. తమిళంలో కూడా మార్కెట్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పుడు సూర్యను రక్షించేది ఎవరా అని అందరూ చూస్తున్నారు. ఆ బాధ్యత తెలుగమ్మాయి అయిన సుధ కొంగర మీదే ఉంది.

ఒకప్పుడు సుమన్ శెట్టి హీరోగా తెలుగులో ఒక చిన్న సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయింది సుధ కొంగర. ఆ సినిమా గురించి ఎవరికీ తెలియదు. ఐతే తర్వాత చెన్నైకి వెళ్లిపోయి మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడి అసిస్టెంటుగా రాటుదేలింది. ఈసారి బాగా టైం తీసుకుని మాధవన్ లాంటి పెద్ద హీరోను పెట్టి ‘ఇరుదు సుట్రు’ సినిమా తీసి సెన్సేషనల్ హిట్ కొట్టింది. తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ అయిన సినిమా ఇది. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా విజయం సాధించింది. సుధపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సినిమా అది. దాని తర్వాత అవసరపడకుండా బాగా టైం తీసుకుని సూర్య సినిమాను సెట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సగం దాకా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ‘ఎన్జీకే’తో సూర్య ఎంతగా దెబ్బ తిన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకో ఫ్లాప్ పడితే ఆయన పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కాబట్టి సుధ మీద పెద్ద బాధ్యతే ఉంది. మరి సూర్య కెరీర్‌ను ఆమె ఏం చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English