ఇంకో 75 మిలియన్లు వస్తే అవతార్‌ మటాష్

ఇంకో 75 మిలియన్లు వస్తే అవతార్‌ మటాష్

ఈ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన సినిమా ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’. ఈ సినిమాపై అంచనాుల ఏ స్థాయిలో ఉన్నాయో.. విడుదలకు ముందు, తర్వాత ఎంత హంగామా కనిపించిందో తెలిసిందే. ఎక్కడో హాలీవుడ్లో తెరకెక్కిన సినిమాకు ఇండియాలో ‘బాహుబలి’ రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఆశ్చర్యం కలిగించింది. వారం రోజుల పాటు ఈ సినిమాకు మల్టీప్లెక్సుల్లో ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇండియాలోనే ఈ చిత్రం రూ.400 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాగే సంచలనం రేపింది ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’. ఈ సినిమా ప్రపంచ సినీ కలెెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేస్తుందనే అంతా అనుకున్నారు. ఆరంభంలో ఊపు చూస్తీ అది ఖాయం అనే అనిపించింది. కానీ రెండు వారాల తర్వాత ఈ సినిమా జోరు తగ్గింది.

దీంతో ‘అవతార్’ ఆల్ టైం రికార్డు బద్దలవుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘ఎవెంజర్స్’ జోరు పూర్తిగా అయితే తగ్గలేదు. తర్వాతి వారాల్లో కూడా ఓ మోస్తరు వసూళ్లతో సాగిపోయింది. ‘అవతార్’ ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా 2.787 బిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పగా.. ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ఇప్పటిదాకా 2.713 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఇంకో 75 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే ఇది ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవబోతోంది. ‘ది ఎండ్ గేమ్’ ప్రపంచ సినీ చరిత్రలో 3 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన తొలి సినిమా అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి కానీ.. దానికి గ్యారెంటీ లేదు. ఐతే టికెట్లు రేట్లు, థియేటర్ల సంఖ్య ఎంతో పెరిగిన ఈ రోజుల్లో ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’.. ‘అవతార్’ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంత కష్టపడుతోందంటే దాన్ని బట్టి జేమ్స్ కామెరూన్ సినిమా గొప్పదనమేంటో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English