ఎట్టకేలకు వెంకటేష్‌ కరుణించాడు!

ఎట్టకేలకు వెంకటేష్‌ కరుణించాడు!

పెళ్లిచూపులు విడుదల కాకముందే తరుణ్‌ భాస్కర్‌ మంచి దర్శకుడు అవుతాడనే నమ్మకంతో సురేష్‌బాబు అతడికి అడ్వాన్స్‌ ఇచ్చాడు. రానా లేదా వెంకటేష్‌కి సరిపోయే కథ సిద్ధం చేయమని చెప్పాడు. అయితే కొత్త ఆలోచనలతో, కొత్త రకం సినిమాలు తీయాలని చూసే తరుణ్‌ భాస్కర్‌ ముందుగా తన అభిరుచికి తగ్గట్టు 'ఈ నగరానికి ఏమైంది' అనే యూత్‌ చిత్రాన్ని తీసాడు. అది అంతంత మాత్రంగానే ఆడడంతో తరుణ్‌ భాస్కర్‌ ఈసారి కథపై బాగా కసరత్తు చేసాడు. మధ్యలో నటన వైపు మళ్లినా కానీ దర్శకత్వంపై ఫోకస్‌ పోలేదు.

ఎట్టకేలకు సురేష్‌బాబు నుంచి అతని కథకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్టు చెబుతున్నారు. వెంకటేష్‌ హీరోగా ఈ చిత్రం వుంటుందట. దీనిపై సురేష్‌ అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఇదిలావుంటే ఫలక్‌నుమా దాస్‌లో ఇన్స్‌పెక్టర్‌ పాత్రలో అదరగొట్టిన తరుణ్‌ని హీరోగా పెట్టి సినిమా తీసే ప్లాన్స్‌ కూడా వున్నాయని వినిపించింది. మరి పూర్తిగా దర్శకత్వం మీదే ఫోకస్‌ పెడతాడో లేక అటో కాలు, ఇటో కాలు వేస్తూ బండి లాగిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English