చరణ్‌ అతడిని బయటకి వెళ్లనిస్తాడా?

చరణ్‌ అతడిని బయటకి వెళ్లనిస్తాడా?

డైరెక్టర్‌ సురేందర్‌ 'ధృవ' చిత్రంతో మెగా కాంపౌండ్‌లో అడుగు పెట్టి గత మూడేళ్లుగా అక్కడే వుండిపోయాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి దర్శకుడెవరని చిరంజీవి అన్వేషిస్తోంటే సురేందర్‌ సమర్ధుడంటూ రెండొందల కోట్ల ప్రాజెక్ట్‌ని అతని చేతుల్లో పెట్టాడు. సురేందర్‌ 'సైరా'ని హ్యాండిల్‌ చేయలేకపోతున్నాడని, అతడిని మార్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గాసిప్‌ రాయళ్లు రకరకాల కథలు పుట్టించారు.

కానీ అతడితోనే సినిమాని పూర్తి చేస్తున్నారు. సైరా అక్టోబర్‌లో విడుదల కానుంది. అంతవరకు సురేందర్‌ ఈ చిత్రంతోనే బిజీగా వుంటాడు. ఆ తర్వాత కూడా అతడిని బయటకు పంపడానికి చరణ్‌ సుముఖంగా లేడు. రాజమౌళితో చేస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' పూర్తయిన తర్వాత చేయబోయే మొదటి రెండు చిత్రాల్లో ఒకటి సురేందర్‌తోనే చేయాలనుకుంటున్నాడు. అయితే అది చేస్తాడా లేదా అనేది సైరా ఫలితంపై ఆధారపడుతుంది. సైరా కనుక అంచనాలని అందుకున్నట్టయితే సురేందర్‌ ఇప్పట్లో కొణిదెల ప్రొడక్షన్స్‌ కాంపౌండ్‌ దాటడు. అది అంచనాలని అందుకోని పక్షంలో చరణ్‌ మనసు మార్చుకుంటాడేమో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English