ప్రజారాజ్యం టైమ్‌లో చరణ్‌... ఇప్పుడు కాపాడేదెవరు?

ప్రజారాజ్యం టైమ్‌లో చరణ్‌... ఇప్పుడు కాపాడేదెవరు?

ప్రజారాజ్యం పరాభవం తర్వాత మెగా అభిమానులు తీవ్రంగా కృంగిపోయారు. ఆ టైమ్‌లో ఎన్నికలయిన కొద్ది రోజులకి విడుదలయింది మగధీర. డీలా పడి వున్న అభిమానులు ఆ టైమ్‌లో అంతగా అంచనాలు కూడా పెట్టుకోలేదు.

కానీ మగధీర అంతకు ముందున్న రికార్డులని తుడిచేసి దాదాపు డబుల్‌ మార్జిన్‌తో కొత్త ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ఆ రికార్డు అలా నిలిచిపోయింది. రాజకీయాల్లో పరాభవం ఎదురయినా కానీ సినిమా రంగంలో మెగా హీరోలే మకుటం లేని మహరాజులు అంటూ అభిమాన లోకం పులకించి పోయింది.

మళ్లీ ఇప్పుడు జనసేన పరాజయంతో ఫాన్స్‌లో అలానే నీరసం అలముకుంది. పవన్‌కళ్యాణ్‌ కూడా గెలవలేకపోయాడని వైరి హీరోల అభిమానులు గేలి చేస్తోంటే వారికి కడుపు మండిపోతోంది. కానీ ఇమ్మీడియట్‌గా మగధీర మాదిరిగా పరువు నిలబెట్టే సినిమా ఏ మెగా హీరో నుంచి వస్తుంది?

చరణ్‌ సినిమా రావడానికి మరో ఏడాదిపైనే సమయం వుంది. ఇక ముందున్నది చిరంజీవి 'సైరా' ఒకటే. తమ్ముడికి ఎదురైన పరాభవంతో డీలా పడిన అభిమానులకి అన్నయ్య ఆనందాన్ని పంచుతాడా? నాన్‌ బాహుబలి రికార్డులని కొట్టి లేదా బాహుబలినే కొట్టి ఫాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపుతాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English