బెల్లం శ్రీదేవి ఇంట్లో మహేష్‌ బాబు!

బెల్లం శ్రీదేవి ఇంట్లో మహేష్‌ బాబు!

'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్‌తోనే మహేష్‌ అభిమానుల మనసులు కొల్లగొట్టిన అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని కూడా తన గత చిత్రాల మాదిరిగా వినోద ప్రధానంగా తీర్చిదిద్దనున్నాడట. హీరో పాత్ర సీరియస్‌గా వుంటూనే కామెడీ పంచ్‌లు వేస్తుంటుందట. అయితే ప్రధానమైన కామెడీ అంతా హీరోయిన్‌, ఆమె ఫ్యామిలీ రూపంలో పండుతుందని వినిపిస్తోంది.

సుప్రీమ్‌లో రాశి ఖన్నా చేసిన బెల్లం శ్రీదేవి పాత్ర, ఆమె ఫ్యామిలీలో 'కత్తందుకో జానకీ', 'కాఫీ' అంటూ చేసే కామెడీ గుర్తుండే వుంటుందిగా. ఇందులో కూడా హీరోయిన్‌ పాత్ర అలా హాస్య ప్రధానంగా వుంటుందట. ఆమె కుటుంబ సభ్యులలో చాలా మంది పాత్రలు అలాగే కామెడీ చేస్తుంటాయని, ఫుల్‌ ఫ్యామిలీ వినోదం అయితే ఖాయమని చెబుతున్నారు.

మొదటి సిట్టింగ్‌లోనే మహేష్‌కి ఈ కామెడీ ట్రాక్‌ చెప్పి అతడిని విపరీతంగా నవ్వించడంతో అనిల్‌ రావిపూడికి వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని అంటున్నారు. దూకుడు తర్వాత మళ్లీ అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వున్న సినిమా చేయని మహేష్‌ ఈ చిత్రానికి అందుకే ఇమ్మీడియట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట.

ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయితే ఎక్కువ రీచ్‌ వుంటుందనే భావనతోనే ముందుగా దీనిని పూర్తి చేయాలని అప్పట్లో సుకుమార్‌తో కమిట్‌ అయిన చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టాడట. సంక్రాంతికి ఆరు నూరైనా 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకోవడానికి మహేష్‌ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English