సమంత, చైతన్య సెపరేట్‌గా పెడుతున్నారా?

సమంత, చైతన్య సెపరేట్‌గా పెడుతున్నారా?

అన్నపూర్ణ స్టూడియోస్‌పై తీసే సినిమాలకి కుటుంబ సభ్యులలో చాలా మందిని భాగస్వాములని చేస్తూ అక్కినేని నాగేశ్వరరావు విల్లు రాసారట. అయితే యాక్టివ్‌గా సినిమాలు తీసేదీ, మిగిలిన వారిలో ఎవరికీ లేని మార్కెట్‌ వున్నదీ అక్కినేని నాగార్జున కుటుంబానికే. అందుకే మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అంటూ విడిగా వారో సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పదో వంతు రాయల్టీని మాత్రమే అన్నపూర్ణా స్టూడియోస్‌కి ఇస్తున్నారు. అయితే మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రధానంగా నాగార్జున అండర్‌లో వుంటుంది. తాను హీరోగా నటించే చిత్రాలకి బడ్జెట్‌ వ్యవహారాలు, ఖర్చులు - రాబడి తదితర అంశాలని నాగ చైతన్య పర్యవేక్షించినా కానీ నిర్మాతగా అతనికి హోదా వుండదు.

కాన్సెప్ట్‌ సినిమాలు తీయడానికి, కొత్త ఆలోచనలని ఎంకరేజ్‌ చేస్తూ బయటి వారిని హీరోలుగా తీసుకోవడానికి కూడా ఉమ్మడి సంస్థ ఇబ్బంది పెడుతోందని సమంత-చైతన్య కలిసి వేరే బ్యానర్‌ స్థాపించే ఆలోచనలో వున్నారట. అయిదారు కోట్లలో తీసే చిన్న సినిమాలనుంచి, తామిద్దరం కలిసి నటించే చిత్రాల వరకు ఇందులో చేయాలనే ఐడియాని నాగార్జున ముందు వుంచారట. నాగార్జున సమ్మతిస్తే ఈ బ్యానర్‌పై తొలి సినిమా త్వరలోనే తెర మీదకి వస్తుందని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English