జీరోలైన సూపర్‌స్టార్లు!

జీరోలైన సూపర్‌స్టార్లు!

ఒక టైమ్‌లో కొన్ని తమిళ అనువాద చిత్రాలు విడుదలవుతున్నాయంటే మన పెద్ద సినిమాలని విడుదల చేయడానికి కూడా నిర్మాతలు జంకేవారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, విక్రమ్‌, సూర్యల చిత్రాలకి ఇక్కడ విపరీతమైన డిమాండ్‌ వుండేది. వాటితో పోటీ పడిన స్ట్రెయిట్‌ సినిమాలు కూడా మట్టి కరిచిన సందర్భాలు కోకొల్లలు. రోబో ధాటికి 'ఖలేజా' గల్లంతయిన  ఉదంతమే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అనువాద చిత్రాలకి ఇక్కడ కాసులు రాలడం లేదు. లారెన్స్‌ 'కాంచన' చిత్రాలు మినహా మరేవీ ఇక్కడ క్లిక్‌ అవడం లేదు. సూర్య 'ఎన్‌జికె' రిలీజ్‌ అవుతోందని 'ఫలక్‌నుమా దాస్‌' లాంటి చిన్న చిత్రం కూడా భయపడలేదు.

వారి ధైర్యానికి తగ్గట్టుగానే ఎన్‌జికె అసలు ప్రభావమే చూపించడం లేదు. సూర్య చిత్రాలు ఇరవై కోట్లకి అమ్మినా లాభాలు వెనకేసుకునే లెవల్‌ నుంచి ఎనిమిది కోట్లకి అమ్మినా సగానికి పైగా నష్టాలు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇక రజనీకాంత్‌ అయితే ఒకానొక టైమ్‌లో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకి ధీటైన విజయాలు సాధించేవారు. కాలా చిత్రానికి కనీస వసూళ్లు కూడా రాలేదు. తెలుగు భారీ చిత్రాలతో సమానమైన రేట్లకి అమ్మడం వల్ల 2.0తో నష్టాలు తప్పలేదు. కమల్‌హాసన్‌, విక్రమ్‌ అయితే ఇప్పుడు పూర్తిగా కనుమరుగు అయిపోయారు. విక్రమ్‌ సినిమాలు ఇక్కడకి అనువాదం కూడా కాని పరిస్థితి వచ్చేసిందిపుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English