వాళ్లుండగా 'సాహో'కు కష్టం రాదులే

వాళ్లుండగా 'సాహో'కు కష్టం రాదులే

ఇప్పుడు సాహో సినిమాను కేవలం ఇండియాలోనే 300 కోట్లు అమ్మేశారంటూ ఒక టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే సినిమా సంగీత దర్శకులు శంకర్ ఎహసాన్ లాయ్ వెళిపోయారు కాబట్టి, ఈ సినిమా మార్కెటింగ్ విషయంలో కాస్త ఇబ్బందిపడాలేమో అంటూ రూమర్లు వచ్చాయి. కాని వారి నిష్ర్కమణ తాలూకు పరిణామాలు మాత్రం సినిమా మీద అస్సలు పడలేదనే చెప్పాలి. దానికో రీజన్ ఉంది.

నిజానికి యువి క్రియేషన్స్ ఒక్కరే ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రొడ్యూస్ చేసుంటే, ఖచ్చితంగా మ్యూజిక్ డైరక్టర్స్ సినిమా నుండి తప్పుకోవడం తాలూకు ప్రభావం కనిపించేదే. కాని ఈ సినిమాకు బ్యాకింగ్ ఉంది ఎవరంటే.. టిసిరీస్. దాదాపు ఇప్పుడు వస్తున్న చాలా హిందీ సినిమాలకు వీరే ఫండర్లు. దేదే ప్యార్ దే, కబీర్ సింగ్ ఇలా లిస్టు చాలా పెద్దదే. అన్నింటికే వీరే సహ నిర్మాతలు. వారి నుండి వస్తున్న మరో సినిమాయే సాహో. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా తాలూకు సేల్స్ ఒక రేంజులో ఉంటుంది.

ఇక తెలుగులో అంటారా.. సినిమాను అన్ని విధాలా చూసుకోవడానికి ప్రభాస్ ఇమేజ్ ఉంది. బాహుబలి తరువాత మనోడు చేసే సినిమా కోసం అందరూ చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి పంపిణీదారులు కూడా ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే సినిమా ట్రైలర్ కూడా రాకముందే ఏకంగా 110 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం రెండు తెలుగు రాష్ట్రంలలో జరిగిందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ అండ్ టిసిరీస్ ఉండగా.. సాహో ఫుల్ సేఫ్‌!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English