నాన్-సాహో రికార్డులనాలేమో

నాన్-సాహో రికార్డులనాలేమో

2015 నుంచి తెలుగు సినిమా రికార్డుల గురించి మాట్లాడే పద్ధతే మారిపోయింది. ‘నాన్-బాహుబలి’ అంటూ కొత్త మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సినిమా రికార్డుల్ని ఇంకెవ్వరూ అందుకోలేని పరిస్థితి తలెత్తడంతో ‘నాన్-బాహుబలి’ అనే మాటడం అనివార్యంగా మారింది. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ‘బాహుబలి’ రికార్డులేవీ బద్దలయ్యేలా కనిపించడం లేదు. దాన్ని పక్కన పెట్టేసి.. నాన్-బాహుబలి ఇండస్ట్రీ రికార్డుల మీద దృష్టిపెడుతున్నాయి మిగతా సినిమాలు.

ఐతే త్వరలో ఇదే తరహాలో కొత్త మాట ప్రాచుర్యంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో రెండు నెలల్లోనే ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ విడుదల కాబోతోంది. ఆ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఆ అంచనాల్ని అందుకుంటే ‘బాహుబలి: ది కంక్లూజన్’ కాకపోయినా.. ‘బాహుబలి: ది బిగినింగ్’ రికార్డులు బద్దలు కావడం ఖాయం.

బిజినెస్ పరంగా అయితే ‘ది బిగినింగ్’ రికార్డులు బద్దలయ్యేలాగే కనిపిస్తున్నాయి. తెలుగు వెర్షన్ మాత్రమే రూ.150 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం,మలయాళ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అక్కడా మంచి క్రేజ్ ఉంది. మొత్తంగా దీని బిజినెస్ రూ.400 కోట్లు దాటే పరిస్థితి కనిపిస్తోంది. అంటే నాన్-బాహుబలి రికార్డుల్ని భారీ తేడాతో బద్దలు కొట్టనున్న ‘సాహో’.. బిజినెస్ పరంగా కొత్త సినిమాలకు కొత్త టార్గెట్ పెట్టేసినట్లే.

ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారం చూస్తే టాక్ ఎలా ఉన్నా.. వసూళ్ల పరంగా నాన్-బాహుబలి సినిమాల్లో కొత్త శిఖరాల్ని అందుకోవడం ఖాయం. ఇక టాక్ బాగుండి, సినిమా అంచనాలకు తగ్గట్లు వసూళ్లు ఓ రేంజిలో ఉంటాయి. కొత్తగా ‘నాన్-బాహుబలి’తో పాటు ‘నాన్ సాహో’ అనే కొత్త మాట కూడా తెరపైకి రావడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English