బాలీవుడ్ మీడియా గూబ గుయ్యిమనిపించాడు

బాలీవుడ్ మీడియా గూబ గుయ్యిమనిపించాడు

సందీప్ రెడ్డి వంగా ఎంత డేరింగ్ అండ్ డాషింగో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అందరికీ తెలిసింది. ఈ సినిమా విడుదలకు ముందు అతడి కాన్ఫిడెన్స్ చూసి అందరూ షాకైపోయారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సందీప్ ఎంత బోల్డ్‌గా మాట్లాడాడో తెలిసిందే. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై ఎంత రగడ జరిగినా పట్టించుకోలేదు ఇప్పుడు అతను ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా కూడా వివాదాలు రాజేస్తోంది.

బాలీవుడ్ మీడియా ఈ సినిమాపై వ్యతిరేక కథనాలు రాస్తోంది. ఇది పురుషాధిక్యాన్ని చాటే సినిమా అని.. మహిళల్ని తక్కువగా చూపించారని ఓ వర్గం అక్కడ విమర్శిస్తుండగా.. దాన్ని హైలైట్ చేస్తోంది మీడియా. ఇప్పటికే ఒకసారి ప్రమోషన్లలో హీరో షాహిద్ కపూర్‌ను ఈ విషయమై ప్రశ్నించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.

తాజాగా సందీప్ రెడ్డిని కూడా ఇదే విషయమై ప్రశ్నించింది. ఐతే సందీప్ అంత ఆషామాషీ వ్యక్తేం కాదు కదా. ఈ సినిమాపై విమర్శలు చేస్తున్న వారికి, మీడియాకు గూబ గుయ్యిమనేలా కౌంటర్ ఇచ్చాడు. తాను సూడో ఫెమినిస్టులను అస్సలు పట్టించుకోనని.. ఎవరికీ భయపడనని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను హీరోయిన్ క్లేవేజ్‌నో, ఇంకోటో చూపించి సినిమాను అమ్ముకునే రకం కాదన్నాడు. ‘కబీర్ సింగ్’లో అలాంటి సీన్ ఒక్కటీ ఉండదని స్పష్టం చేశాడు.

కథ ప్రకారం అవసరమైంది మాత్రమే చేశానని.. సినిమా చూడకుండా ఇది ఫలానా తరహా సినిమా అని ముద్ర వేయడం.. గొడవ చేయడం సరి కాదని అతనన్నాడు. ఊరికే గొడవ చేయాలని చూసే వాళ్లను అసలు తాను పట్టించుకోనని అన్నాడు. దక్షిణాది నుంచి వచ్చాడని సందీప్‌ను తక్కువగా అంచనా వేసినట్లుంది బాలీవుడ్ మీడియా. అతడి బోల్డ్ స్టేట్మెంట్‌ చూసి అందరూ సైలెంటైనట్లే ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English