రామ్ గోపాల్ వర్మతో మళ్లీ జేడీ సైనిమా

రామ్ గోపాల్ వర్మతో మళ్లీ జేడీ సైనిమా

ఇప్పుడు దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఎంతగా అయినా పతనం అయి ఉండొచ్చు. కానీ భారతీయ సినిమాపై ఆయన ప్రభావాన్ని మాత్రం తక్కువగా చూడలేం. ‘శివ’, ‘రంగీలా’, ‘సత్య’, ‘కంపెనీ’, సర్కార్’ లాంటి సినిమాలతో ఒకప్పుడు దేశాన్ని ఒక ఊపు ఊపేశాడు వర్మ. ఇండస్ట్రీకి ఆయన అందించినంతమంది ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నీషియన్లను ఇంకెవరూ అందించి ఉండరు.

వర్మ పరిచయం చేసిన ప్రతిభావంతుల్లో జేడీ చక్రవర్తి కూడా ఒకడు. మామూలుగా జేడీని చూస్తే ఇతనేం హీరో అనిపిస్తుంది కానీ.. అతడితో వరుసగా సినిమాలు తీసి.. హీరోగా అందరి ఆమోదం పొందేలా చేసిన ఘనత వర్మదే. వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో కూడా పని చేసిన జేడీ.. ఆయన నిర్మాణంలో తనే దర్శకుడిగా సినిమాలు కూడా తీశాడు. ఐతే కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు.

ఇక మళ్లీ వర్మ-జేడీ కాంబినేషన్లో సినిమా రాదనే అనుకున్నారు. కానీ మళ్లీ తన గురువుతో తాను సినిమా చేయబోతున్నట్లు జేడీ వెల్లడించడం విశేషం. జేడీ తాజాగా ‘హిప్పీ’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దాని ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన జేడీ.. వర్మతో సినిమా గురించి వెల్లడించాడు. వర్మ నిర్మాణంలో తాను హీరోగా ఒక దర్శకుడు సినిమా రూపొందించబోతున్నట్లు చెప్పాడు. అంతకుమించి వివరాలేమీ చెప్పలేదు.

ఐతే దర్శకుడిగా, నిర్మాతగా వర్మ ఇప్పుడు పేలవమైన ట్రాక్ రికార్డుతో ఉన్నాడు. ఆయన నిర్మించే సినిమాలన్నా కూడా జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక జేడీ సంగతి చెప్పాల్సిన పని లేదు. అతను హీరోగా సినిమా అంటే ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అతడి మార్కెట్ జీరో అయిపోయింది. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో జేడీ హీరోగా తెరకెక్కిన ఓ సినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. మరి ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే జనాలకు ఏం ఆసక్తి ఉంటుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English